Apple Employees : వారంలో 3 రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయమన్న టిమ్ కుక్.. నిరసనకు దిగిన ఆపిల్ ఉద్యోగులు!

Apple Employees : ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు (Covid-19) కేసులు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రస్తుత పరిస్థితులు సాధారణ పరిస్థితులకు నెమ్మదిగా వచ్చేస్తున్నాయి. ఎప్పటిలానే అందరూ తమ వృత్తుల్లో, ఉద్యోగాల్లో మునిగితేలుతున్నారు.

Apple Employees : ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు (Covid-19) కేసులు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రస్తుత పరిస్థితులు సాధారణ పరిస్థితులకు నెమ్మదిగా వచ్చేస్తున్నాయి. ఎప్పటిలానే అందరూ తమ వృత్తుల్లో, ఉద్యోగాల్లో మునిగితేలుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను ఆఫీసులకు వచ్చి పనిచేయాల్సిందిగా సూచిస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీల ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ కు స్వస్తి చెప్పి ఆఫీసులకు వెళ్లి పనిచేసుకుంటున్నారు.

చాలావరకూ టెక్ కంపెనీలు కూడా ఆఫీస్ వర్క్ చేయాలంటూ తమ ఉద్యోగులను కోరుతున్నాయి. టెక్ దిగ్గజాల్లో ఒకటైన ఆపిల్ కూడా తమ ఉద్యోగులను ఆఫీసులకు రావాల్సిందిగా ఆదేశించింది. కానీ, ఆపిల్ ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పనిచేసేందుకు ఇష్టపడటం లేదు. వర్క్ ఫ్రమ్ హోం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) ఉద్యోగులకు ఒక ఆఫర్ ఇచ్చారు. వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసుల్లోనే పనిచేయాల్సిందిగా ఆదేశించారు.

అంతే.. ఉద్యోగులంతా ఆఫీసులకు వచ్చి పనిచేసేది లేదు.. చేస్తే ఇంట్లో చేస్తాం.. లేదంటే మానేస్తాం అన్నట్టుగా నిరనసన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి, ప్రస్తుత Apple తమ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న AppleTogether, మరింత సౌకర్యవంతమైన పని వాతావరణాన్ని కోరుతూ పిటిషన్‌ వేసింది. ఆ పిటిషన్‌లో, WSJ నివేదించినట్లుగా.. AppleTogether గ్రూపు ఉద్యోగులు తమ మేనేజర్‌లతో వారి స్వంత పని ఏర్పాట్లను నిర్ణయించుకునేలా టెక్ దిగ్గజాన్ని అభ్యర్థించింది.

Apple employees protest after Tim Cook asks them to come to office 3 days a week

ఈ పిటిషన్‌లో సోమవారం మధ్యాహ్నం నాటికి 270 కంటే ఎక్కువ సంతకాలు చేశారు. ప్రపంచ శ్రామిక శక్తిలో కొంత భాగం మాత్రమేని తెలిపింది. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం.. ఆపిల్‌లో మొత్తం 1,65,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. అనుకూలమైన పని ఏర్పాట్లను అభ్యర్థించేందుకు Apple ఉద్యోగులు అనేక కారణాలను పేర్కొన్నారు. వాటిలో కొన్ని ఆరోగ్య సమస్యలు, అందులో కొన్ని అనువైన పనివాతావరణంలో సంతోషంగా పనిచేయగలమనే వాస్తవాన్ని కూడా చేర్చాయి. గత 2ఏళ్లకు పైగా Apple ఆఫీస్ ఆధారిత ఉద్యోగులు అసాధారణమైన పని పట్ల సానుకూలంగా పనిచేసే వాతావరణాన్ని కల్పించడంలో విఫలమయ్యాయని పిటిషన్ పేర్కొంది.

ముఖ్యంగా, అధిక ద్రవ్యోల్బణం, ఇతర ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ Apple ఇటీవలి త్రైమాసిక ఫలితాలు ఊహించిన దాని కంటే కొంచెం మెరుగ్గానే ఉన్నాయి. ఐఫోన్ అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయని కంపెనీ నివేదించింది. అనేక ఇతర టెక్ కంపెనీల మాదిరిగానే, Apple CEO ఉద్యోగులను చాలాసార్లు ఆఫీసులకు వచ్చి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే మహమ్మారి కారణంగా ఉద్యోగులు ఆఫీసులకు వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. చివరగా, ప్రతి ఒక్కరూ వారానికి కనీసం 3 రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయాలని కుక్ కోరారు.

ఆపిల్ ఉద్యోగులు కుక్ నిర్ణయంపై పెద్దగా ఆసక్తి చూపలేదు. టెక్ కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు తీసుకొచ్చేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో ఉద్యోగులు అనుకూలంగా లేరని నివేదిక తెలిపింది. గూగుల్, మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులను కనీసం వారంలో కొంత భాగం ఆఫీసుల నుంచి పని చేయమని కోరాయి. అందులోనూ టెస్లా, స్పేస్‌ఎక్స్ వంటి కంపెనీలు కఠినమైన నిబంధనలను విధించాయి. కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులను వారానికి కనీసం 40 గంటలు ఆఫీసు నుంచి పని చేయమని కోరాయి.

Read Also : Apple Users : ఆపిల్ యూజర్లకు అలర్ట్.. జూన్‌ 1లోపు ఈ రెండింట్లోకి మారండి.. ఎందుకంటే?

ట్రెండింగ్ వార్తలు