CM Revanth Reddy : ఆ సినిమా టీమ్‌ని అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి..

తాజాగా సీతా కళ్యాణ వైభోగమే మూవీ టీమ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

CM Revanth Reddy : సుమన్ తేజ్, గరీమ చౌహన్ జంటగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాచాల యుగంధర్ నిర్మాణంలో సతీష్ పరమవేద దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సీతా కళ్యాణ వైభోగమే’. హీరో గగన్ విహారి ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే సీతా కళ్యాణ వైభోగమే సినిమా నుంచి సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ విడుదల చేసారు. ఈ సినిమా జూన్ 21న విడుదల కానుంది.

Also Read : Nikhil – Varun Sandesh : ‘హ్యాపీడేస్’ రోజులు గుర్తొచ్చేలా.. వరుణ్ సందేశ్ కోసం నిఖిల్..

తాజాగా మూవీ టీమ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం రేవంత్ రెడ్డికి సినిమా టీజర్, ట్రైలర్‌ను చూపించారు. సీతా కళ్యాణ వైభోగమే ట్రైలర్‌ను చూసిన ముఖ్యమంత్రి మూవీ యూనిట్‌ను అభినందించారు. ట్రైలర్ బాగుందని, సినిమా హిట్ అవ్వాలని అన్నారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, నిర్మాత రాచాల యుగంధర్, డైరెక్టర్ సతీష్, నీరూస్ ప్రతినిధి అసీమ్, నటీనటులు సుమన్ తేజ్, గరీమ చౌహాన్, గగన్ విహారి.. పలువురు మూవీ టీమ్ సీఎంను కలిశారు.

ట్రెండింగ్ వార్తలు