Cybersecurity Experts Warn : హాలీవుడ్ మూవీ ‘Spider Man’ పేరుతో సైబర నేరగాళ్ల స్కెచ్.. తస్మాత్ జాగ్రత్త!

ఆన్‌లైన్ వినియోగదారులకు అలర్ట్.. ఆన్‌లైన్ ద్వారా పేమెంట్స్, ఫోన్ కాల్స్ వంటి విషయంలో తస్మాత్ జాగ్రత్త అంటున్నారు సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్లు.

Cybersecurity Experts Warn : ఆన్‌లైన్ వినియోగదారులకు అలర్ట్.. ఆన్‌లైన్ ద్వారా పేమెంట్స్, ఫోన్ కాల్స్ వంటి విషయంలో తస్మాత్ జాగ్రత్త అంటున్నారు సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్లు. ఆన్ లైన్ యూజర్లను ఆకట్టుకునేందుకు సైబర్ నేరగాళ్లు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. మూవీ పేర్లతో ఫ్రాడ్ క్లిక్ లింకులను షేర్ చేస్తున్నారని సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు. ఇటీవల హాలీవుడ్ లో రిలీజ్ అయి కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న కొత్త మూవీ Spider Man : No Way Home పేరుతో సైబర్ నేరగాళ్లు దోపిడీకి తెరలేపారు. ఈ మూవీ పేరుతో ఫిషింగ్ లింక్స్ పంపుతూ బ్యాంకు అకౌంట్లలో నగదును కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ Kaspersky రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు. ఫిషింగ్ వెబ్ సైట్లలో మూవీకి సంబంధించి ప్రీమియర్ చూడొచ్చు అంటూ ఫ్రాడ్ లింకులను షేర్ చేస్తున్నారని Kaspersky రీసెర్చర్లు గుర్తించారు. ఈ లింకుల ద్వారా యూజర్ల బ్యాంకు అకౌంట్ల వివరాలను దొంగిలించే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు.

ఫిషింగ్ వెబ్ సైట్లలో Spider Man : No Way Home మూవీకి ముందే ప్రీమియర్ వాచ్ చేయాలంటే వెంటనే రిజిస్ట్రర్ చేసుకోవాలంటూ లింకులను పంపుతున్నట్టు గుర్తించారు. అందుకు యూజర్లు తమ క్రెడిట్ కార్డుల వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఎవరైనా మూవీ కోసం తమ వివరాలను ఎంటర్ చేస్తే అంతే సంగతలు.. మీ క్రెడిట్ వివరాలను సైబర్ నేరగాళ్లు దొంగిలిస్తారు. పైగా మూవీ ప్రీమియర్ ఏది కనిపించదు. ఈ కొత్త మూవీ చూడాలనే ఉత్సాహంతో చాలామంది సైబర్ నేరగాళ్లు వలలో చిక్కుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్లు.

సూపర్ హీరోల మూవీలు ఎప్పుడూ అభిమానులను ఆకట్టుకునేలా ఉంటాయి. అందులోనూ ట్రైలర్స్ మరింత ఆకట్టుకుంటాయి. ఆన్ లైన్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే వెబ్ సైట్లలో కూడా సైబర్ నేరగాళ్లు టార్జెన్స్ (Trojans), Adware వంటి మాల్ వేర్ లింకులను హైడ్ చేసి ఉంటారని, అలాంటి లింకులను క్లిక్ చేయడం ద్వారా యూజర్లు డేటా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి లింకులను చూసి ఎవరూ తొందరపడి క్లిక్ చేయొద్దని సూచిస్తున్నారు.

Read Also : Omicron Cases In India : దేశంలో 101 కి చేరిన ఒమిక్రాన్ కేసులు..కేంద్రం కీలక సూచనలు

ట్రెండింగ్ వార్తలు