WhatsApp Update : వాట్సాప్‌ యూజర్ల కోసం కొత్త డిజైన్ వచ్చేసిందోచ్.. ఇప్పుడే చెక్ చేసుకోండి!

WhatsApp Update : వాట్సాప్‌లో ఐఓఎస్, ఆండ్రాయిడ్‌లో కొత్త డిజైన్‌ను తీసుకొచ్చింది. అప్‌గ్రేడ్ డార్క్ మోడ్, రీడిజైన్ లైట్ మోడ్, కొత్త కలర్ స్కీమ్, రీడిజైన్ చేసిన ఐకాన్స్, బటన్‌లు ఉన్నాయి.

WhatsApp Update : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం సరికొత్త డిజైన్ ప్రవేశపెట్టింది. మెసేజింగ్ యాప్ క్రమంగా కొత్త డిజైన్ విస్తరిస్తోంది. డార్క్ మోడ్‌ అప్‌గ్రేడ్ ప్రవేశపెట్టిన ముఖ్యమైన మార్పులలో ఇదొకటి. ఇప్పుడు టెక్స్ట్ రీడబిలిటీని మెరుగుపరచడానికి డార్క్ బ్యాక్ గ్రౌండ్ కలిగి ఉంది.

Read Also : WhatsApp Pin Chats : వాట్సాప్ యూజర్లు ఇకపై 3 మెసేజ్‌ల వరకు పిన్ చేయొచ్చు.. ఇదిగో ఇలా!

లైట్ మోడ్ అదనపు వైట్ స్పేస్‌తో వస్తుంది. కలర్ స్కీమ్ పరంగా, వాట్సాప్ బ్రాండ్ ఐడెంటిటీతో కొత్త లైట్ గ్రీన్ కలర్ కలిగి ఉంది. అంతేకాకుండా, స్క్రీన్‌ డిజైన్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోసం కలర్ వినియోగం వ్యూహాత్మకంగా అప్‌గ్రేడ్ చేసింది. ఐకాన్, బటన్ డిజైన్‌లు కూడా మారాయి. షేప్, కలర్ మార్పులతో మరింత ఆకట్టుకునే ఇంటర్‌ఫేస్‌ కలిగి ఉంటుంది.

వాట్సాప్‌లో లోగో చూశారా? :
ఇంకా, యాప్‌లోని కొన్ని సెక్షన్లలో రీడబిలిటీ, నావిగేషన్‌ను అప్‌గ్రేడ్ అందుకుంది. ‘చాట్‌లు’ ట్యాబ్‌లో యూజర్లు ఇప్పుడు వాట్సాప్ లోగోను చూడవచ్చు. ఇంటర్‌ఫేస్‌లో ప్రత్యేకమైన వ్యూను కలిగి ఉంటుంది. అదనంగా, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం స్క్రీన్ పైభాగంలో గతంలో ఉంచిన నావిగేషన్ ట్యాబ్‌లు దిగువకు సులభంగా యాక్సెస్‌ను అందిస్తుంది.

ఈ అప్‌డేట్ క్రమంగా వాట్సాప్ వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. అంటే.. యూజర్లు ఫీచర్‌ను పొందకుండా ఆపలేరని గమనించాలి. మార్పులు తక్షణమే యూజర్లకు కనిపించకపోవచ్చు. లేటెస్ట్ ఫీచర్లను యాక్సస్ చేసేందుకు యాప్‌ను అప్‌డేట్‌గా ఉంచాలని వాట్సాప్ సూచిస్తోంది.

Read Also : WhatsApp Audio Call Bar : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఆడియో కాల్ బార్ ఫీచర్ వస్తోంది..!

ట్రెండింగ్ వార్తలు