Aadhaar Photo Update : మీ ఆధార్ కార్డ్‌లో ఫొటో ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

Aadhaar Photo Update : భారత పౌరులకు ఆధార్ కార్డ్ (Aadhaar Photo Update) అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డుల్లో ఒకటి. 12-అంకెల వ్యక్తిగత గుర్తింపు సంఖ్యను భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేసింది.

Aadhaar Photo Update : భారత పౌరులకు ఆధార్ కార్డ్ (Aadhaar Photo Update) అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డుల్లో ఒకటి. 12-అంకెల వ్యక్తిగత గుర్తింపు సంఖ్యను భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేసింది. కార్డ్ హోల్డర్ డెమోగ్రాఫిక్, బయోమెట్రిక్ డేటాను కలిగి ఉంది. ప్రభుత్వ ప్రయోజనాలను పొందడం, స్కూల్ లేదా కాలేజీల కోసం ఫారమ్‌లను నింపడం, ఇతర అధికారిక పనులకు అవసరంగా వినియోగించుకోవచ్చు. ఆధార్‌లోని అన్ని ప్రత్యేక గుర్తింపు సంఖ్యలు జీవితాంతం ఒకేలా ఉంటాయి. కానీ, కార్డులో మిగతా వివరాలను అప్‌డేట్ చేయాల్సి రావొచ్చు.

How To Update Aadhaar Card Photo, Step-by-Step Guide

కొన్నిసార్లు ఇంటి చిరునామా, ఫోన్ నంబర్, ఫోటోను కూడా సమయానుసారంగా అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్‌పై ఏదైనా సమాచారాన్ని మార్చాలనుకునే వినియోగదారుల కోసం UIDAI అధికారిక సైట్‌ని విజిట్ చేయాల్సి ఉంటుంది. తద్వారా ఆయా వివరాలను సవరించేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) వారిని అనుమతిస్తుంది.

మీరు ఆధార్ ఫోటోను లేటెస్ట్ మూవీతో అప్‌డేట్ చేయాలనుకుంటే పూర్తి చేసేందుకు ఆధార్ నమోదు కేంద్రం/ఆధార్ సర్వీసు కేంద్రాన్ని విజిట్ చేయవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా ఆధార్ కార్డులో మార్పులు చేయవచ్చు. కానీ, సమీప కేంద్రాన్ని కూడా సందర్శించాలి. మీ ఆధార్ కార్డ్‌లో మీ ఫోటోగ్రాఫ్‌ను ఎలా అప్‌డేట్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆధార్ కార్డ్‌లో ఫోటోను ఎలా అప్‌డేట్ చేయాలంటే? :
– అధికారిక UIDAI వెబ్‌సైట్‌ను uidai.gov.in విజిట్ చేయండి.
– వెబ్‌సైట్ నుంచి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్‌ను సెర్చ్ చేయండి. డౌన్‌లోడ్ చేయండి.
– ఫారమ్‌లో అన్ని వివరాలను పూరించండి. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ లేదా ఆధార్ సర్వీసు కేంద్రానికి సమర్పించండి.
– ప్రస్తుతం ఆధార్ ఎగ్జిక్యూటివ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా అన్ని వివరాలను నిర్ధారిస్తారు.
– ఆ తర్వాత, ఎగ్జిక్యూటివ్ మీ ఆధార్ కార్డ్‌లో అప్‌డేట్ చేసే కొత్త ఫొటోను క్లిక్ చేయాల్సి ఉంటుంది.
– ఆధార్ సర్వీసు కోసం GSTతో పాటు రూ. 100 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
– ఆధార్ ఎగ్జిక్యూటివ్ రసీదు స్లిప్, అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) అందిస్తారు.

Note : మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్‌లో URN నంబర్‌ని ఉపయోగించి మీ లేటెస్ట్ ఆధార్ కార్డ్ స్టేటస్ ట్రాక్ చేయవచ్చు. అదనంగా, ఆధార్ ఫొటో అప్‌డేట్ ప్రక్రియకు 90 రోజుల వరకు పట్టవచ్చు. ప్రక్రియ తర్వాత.. మీరు ఆధార్ నమోదు కేంద్రాన్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. తద్వారా UIDAI అధికారిక వెబ్‌సైట్ నుంచి E-ఆధార్ కాపీని డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీ అప్‌డేట్ చేయాల్సిన ఆధార్ కార్డ్‌ని ప్రింట్ తీసుకోవచ్చు.

Read Also : Aadhaar Card : ఆధార్ కార్డులో మీ ఫోన్ నెంబర్ ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

ట్రెండింగ్ వార్తలు