Infinix Zero 30 5G Pre-Orders : కొత్త ఫోన్ కొంటున్నారా? సెప్టెంబర్ 2 నుంచి ఈ 5G ఫోన్‌పై ప్రీ-ఆర్డర్లు.. కీలక ఫీచర్లు ఇవే..!

Infinix Zero 30 5G Pre-Orders : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వచ్చే సెప్టెంబర్ 2న ఇన్పినిక్స్ జీరో 30 5G ఫోన్‌పై ప్రీ-ఆర్డర్లు మొదలు కానున్నాయి. లాంచ్‌కు ముందే ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి.

Infinix Zero 30 5G Pre-Orders : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఇన్ఫినిక్స్ (Infinix) నుంచి కొత్త (Infinix Zero 30 5G) ఫోన్ భారత మార్కెట్లో త్వరలో లాంచ్ కానుందని కంపెనీ ధృవీకరించింది. ఈ ఫోన్ డిసెంబర్ 2022లో లాంచ్ అయిన Infinix Zero 20 5G ఫోన్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్. MediaTek Helio G99 SoC, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీతో వస్తుంది.

ఇన్ఫినిక్స్ ఇప్పుడు దేశంలో హ్యాండ్‌సెట్ ప్రీ-ఆర్డర్ తేదీని వెల్లడించింది. ఇంతకుముందు ఈ హ్యాండ్‌సెట్ డిజైన్‌ను కంపెనీ వెల్లడించింది. ఇప్పుడు ఇన్ఫినిక్స్ జీరో 30 5G ఇతర కీలక స్పెసిఫికేషన్‌లను కూడా ధృవీకరించింది. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త టీజర్‌లను ప్రకటించనుంది. సెప్టెంబర్ 2 నుంచి భారత మార్కెట్లో ప్రీ-ఆర్డర్‌లకు (Infinix Zero 30 5G) అందుబాటులో ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ వెల్లడించింది.ఈ ఫోన్ హైలైట్ ఫీచర్ 50MP ఫ్రంట్ కెమెరా సెన్సార్, 60fpsతో వీడియో రికార్డింగ్‌ను అందిస్తుంది. 4K రిజల్యూషన్ కలిగి ఉండనుంది.

Read Also : Hero Glamour Launch : కొంటే ఇలాంటి బైక్ కొనాలి.. కొత్త హీరో గ్లామర్ బైక్ ఇదిగో.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంతంటే?

ఇన్ఫినిక్స్ కీలక ఫీచర్లు (అంచనా) : 

ఈ ఫీచర్ కంటెంట్ క్రియేటర్‌లను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. సెగ్మెంట్‌లో ఇదే ఫస్ట్ అని చెప్పవచ్చు. ఇన్ఫినిక్స్ జీరో 30 5G రెండు వైపులా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, 950 నిట్‌ల గరిష్ట ప్రకాశం స్థాయితో 6.78-అంగుళాల కర్వడ్ 10-బిట్ AMOLED ప్యానెల్‌ను ఉపయోగిస్తుంది.

Infinix Zero 30 5G Pre-Orders to Start in India on September 2; Key Specifications Revealed

ముఖ్యంగా, ఇన్పినిక్స్ జీరో 20 5G ఫోన్ 7.98mm మందంతో రానుంది. అయితే, జీరో 30 మోడల్ 7.9 మి.మీ మందంగా ఉంటుందని, ఈ సెగ్మెంట్‌లో ఇదే అత్యంత సన్నని ఫోన్ అని కంపెనీ పేర్కొంది. గతంలో లావెండర్, గోల్డెన్ కలర్ ఆప్షన్‌లో రానుంది. ఇప్పుడు హ్యాండ్‌సెట్ లీచీ లాంటి లెదర్ ఫినిషింగ్‌తో అదనపు గ్రీన్ కలర్ వేరియంట్‌లో కనిపిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ప్రకారం.. కెమెరా, ప్రాసెసర్ వివరాలు వరుసగా ఆగస్టు 28 నుంచి ఆగస్టు 30న వెల్లడి అయ్యాయి. అయితే, టిప్‌స్టర్ నితిన్ ప్రసాద్ (@_the_tech_guy) Infinix Zero 30 5Gని MediaTek Dimensity 8020 SoC ద్వారా అందించవచ్చు. గరిష్టంగా 12GB వరకు LPDDR4X RAM, 256GB UFS 3.1 ఇంబిల్ట్ స్టోరేజ్‌తో రానుందని ట్వీట్ చేశారు.

టిప్‌స్టర్ ప్రకారం.. ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌లో 108MP సెన్సార్‌తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 13MP సెన్సార్, 2MP సెన్సార్ ఉంటాయి. Infinix Zero 30 5G కూడా 68W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీతో రానుంది. భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ. 25వేల లోపు ఉండవచ్చు.

Read Also : Royal Enfiled Bullet 350 : డుగ్ డుగ్ బండి వచ్చేస్తోంది.. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఇదిగో.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!

ట్రెండింగ్ వార్తలు