Moto G54 5G Launch Date : మోటో G54 5G ఫోన్ వస్తోంది.. సెప్టెంబర్ 5నే లాంచ్.. డేట్ సేవ్ చేసి పెట్టుకోండి..!

Moto G54 5G Launch Date : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే మరికొద్ది రోజులు ఆగండి. వచ్చే సెప్టెంబర్‌లో మోటోరోలా నుంచి మోటో G54 5G ఫోన్ లాంచ్ కానుంది.

Moto G54 5G Launch Date : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా (Motorola) నుంచి సరికొత్త 5G ఫోన్ గ్లోబల్ మార్కెట్లోకి రానుంది. వచ్చే సెప్టెంబర్‌లో చైనాలో Moto G54 5G ఫోన్ లాంచ్ అవుతుందని కంపెనీ ధృవీకరించింది. ఈ ఫోన్ (Moto G53 5G)కి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వస్తుందని భావిస్తున్నారు. డిసెంబర్ 2022లో చైనాలో, ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా జనవరి 2023లో ఫోన్ అందుబాటులోకి వచ్చింది.

ఇటీవల, Moto G54 లీకైన ఫొటోలను పరిశీలిస్తే.. ఈ హ్యాండ్‌సెట్ రూపకల్పనపై ఇతర పుకార్లు కూడా కొన్ని సూచించాయి. హ్యాండ్‌సెట్ ముఖ్య ఫీచర్లలో ముందున్న మోటో G53 5G ఫోన్, Qualcomm Snapdragon 480+ SoC, 10W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. సక్సెసర్ పాత మోడల్‌పై అప్‌గ్రేడ్‌లతో రానుందని భావిస్తున్నారు.

Read Also : Royal Enfiled Bullet 350 : డుగ్ డుగ్ బండి వచ్చేస్తోంది.. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఇదిగో.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!

చైనీస్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ వీబోలో పోస్ట్‌లో.. మోటో G54 5G ఫోన్ సెప్టెంబరు 5న చైనాలో లాంచ్ అవుతుందని మోటోరోలా ధృవీకరించింది. ఈ ఫోన్ గతంలో XT-2343-1 మోడల్ నంబర్‌తో FCC వెబ్‌సైట్‌లో గుర్తించారు. ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుందని సూచించింది. డ్యూయల్ నానో SIM, Wi-Fi 802.11 /b/g/n/ac, NFC, బ్లూటూత్ కనెక్టివిటీతో రానుంది. TDRA, BIS వెరిఫైడ్ సైట్‌లలో కూడా రానుంది. ఇంతలో (MySmartPrice) నివేదిక ప్రకారం.. Moto G54 డిజైన్ రెండర్‌లు చైనా (TENAA) వెబ్‌సైట్‌లో లిస్టు అయ్యాయి.

Moto G54 5G Launch Date Set for September 5; Tipped to Get MediaTek Dimensity SoC

ఫొటోలు, మునుపటి లీక్‌ల మాదిరిగానే డిజైన్‌ను చూపుతున్నాయి. LED ఫ్లాష్‌తో పాటుగా డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ వెనుక ప్యానెల్‌లోని టాప్ లెఫ్ట్ కార్నర్‌లో కొద్దిగా పెరిగిన దీర్ఘచతురస్రాకార కెమెరా ఐలాండ్‌లో ఉంచుతుంది. డిస్ప్లే మందపాటి సైడ్ బెజెల్‌లను, సెల్ఫీ కెమెరాకు సెంటర్-అలైన్డ్ హోల్-పంచ్ స్లాట్‌ను పొందుతుంది. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ అవుతుందని తెలిపింది.

నివేదిక ప్రకారం.. మోటో G54 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల ఫుల్-HD+ (2400 X 1080 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 8GB RAM, 256GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌తో వస్తుంది. కెమెరా మాడ్యూల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 16MP ఫ్రంట్ కెమెరా సెన్సార్‌తో వెనుక భాగంలో 50MP ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.

Moto G54 5G ఫోన్ 4,850mAh బ్యాటరీతో రానుంది. అంబ్రోసియా, బల్లాడ్ బ్లూ, కరోనెట్ బ్లూ, ఔటర్ స్పేస్ కలర్ ఆప్షన్‌లలో రానుంది. మోటో G53 5G ఫోన్ 4GB + 128GB వేరియంట్ ధర EUR 299 (సుమారు రూ. 22,100), ఇంక్ బ్లూ, ఆర్కిటిక్ సిల్వర్, లేత గులాబీ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

Read Also : Infinix Zero 30 5G Pre-Orders : కొత్త ఫోన్ కొంటున్నారా? సెప్టెంబర్ 2 నుంచి ఈ 5G ఫోన్‌పై ప్రీ-ఆర్డర్లు.. కీలక ఫీచర్లు ఇవే..!

ట్రెండింగ్ వార్తలు