OnePlus Nord N30 5G : వన్‌ప్లస్ నార్డ్ N30 5G సిరీస్ ఫోన్ స్పెషిఫికేషన్లు లీక్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

OnePlus Nord N30 5G : వన్‌ప్లస్ నుంచి సరికొత్త 5G ఫోన్ గ్లోబల్ మార్కెట్లోకి రాబోతోంది. లాంచ్‌కు ముందే వన్‌ప్లస్ నార్డ్ N30 5G సిరీస్ ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి.

OnePlus Nord N30 5G : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) గత ఏడాదిలో వన్‌ప్లస్ నార్డ్ N20 5Gకి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా త్వరలో లాంచ్ కానుంది. అధికారిక ప్రకటన కన్నా ముందే.. వన్‌ప్లస్ Nord సిరీస్ స్మార్ట్‌ఫోన్ (Geekbench) బెంచ్‌మార్కింగ్ సైట్‌లో కనిపించింది. వన్‌ప్లస్ Nord N30 5G ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 695 SoC, 8GB RAMతో వస్తుంది. జాబితా మోడల్ నంబర్ CPH2513 ఉండగా.. Android 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను సూచిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ N30 5G ఫోన్ అమెరికా మార్కెట్‌లో వన్‌ప్లస్ Nord CE 3 Lite రీబ్రాండెడ్ వెర్షన్‌గా లాంచ్ అవుతుందని చెప్పవచ్చు.

Geekbench జాబితా మోడల్ నంబర్ (CPH2513)తో OnePlus స్మార్ట్‌ఫోన్‌ అదే మోడల్ నంబర్ ఇటీవల Google Play Console సైట్‌లో కనిపించింది. ఆ తర్వాత వన్‌ప్లస్ Nord N30 5Gగా వస్తుందని తెలిపింది. జాబితా ప్రకారం.. ఆక్టా-కోర్ చిప్‌సెట్ ఫోన్‌కు పవర్ అందిస్తుంది. గరిష్టంగా 2.21GHz క్లాక్ స్పీడ్‌తో రెండు CPU కోర్లను, 1.80GHz వద్ద క్యాప్ చేసిన 6 కోర్లను సూచిస్తుంది. ఈ CPU స్పీడ్ స్నాప్‌డ్రాగన్ 695 SoCతో వస్తుంది. ఈ ఫోన్ 7.23GB మెమరీతో పాటు 8GB RAMకి వస్తుంది.

Read Also : Lexus GX SUV : 2024 లెక్సస్ GX లగ్జరీ ఫుల్ సైజ్ SUV కారు.. డిజైన్ అదుర్స్.. గ్లోబల్ లాంచ్ ఎప్పుడంటే?

బెంచ్‌మార్క్ లిస్టు ప్రకారం.. OnePlus Nord N30 5Gలో Android 13ను సూచిస్తుంది. 888 పాయింట్ల సింగిల్-కోర్ స్కోర్, 2076 పాయింట్ల మల్టీ-కోర్ స్కోర్‌ను అందిస్తుంది. OnePlus ఫోన్ వాస్తవ పనితీరును ప్రతిబింబించవు. గీక్‌బెంచ్‌లో కనిపించిన హ్యాండ్‌సెట్ కేవలం ప్రోటోటైప్ కావచ్చు. వన్‌ప్లస్ నార్డ్ N30 5G ఫోన్ అమెరికాలో OnePlus Nord CE 3 Lite 5G రీబ్రాండెడ్ వెర్షన్‌గా వస్తుందని భావిస్తున్నారు. రెండోది భారత మార్కెట్లో ఏప్రిల్‌లో లాంచ్ కానుంది. 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.19,999గా ఉండొచ్చు.

OnePlus Nord N30 5G Specifications Leaked via Geekbench Listing

వన్‌ప్లస్ నార్డ్ CE 3 Lite 5G ఫోన్ 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల ఫుల్-HD (1,080×2,400 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 695 SoC ఆధారిత ఫోన్ అని చెప్పవచ్చు. 8GB LPDDR4X RAMతో రానుంది. ఈ హ్యాండ్‌సెట్ 108MP శాంసంగ్ HM6 సెన్సార్ నేతృత్వంలోని ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. 16MP సెల్ఫీ సెన్సార్‌ను కలిగి ఉంది. 256GB UFS 2.2 స్టోరేజీ వరకు అందిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ CE 3 Lite 5G ఫోన్ మోడల్ 67W SuperVOOC వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,000mAh బ్యాటరీతో రానుంది.

Read Also : BGMI iPhone Users : భారతీయ ఐఫోన్ యూజర్ల కోసం బీజీఎంఐ గేమ్.. పాత అకౌంట్‌తో ఇలా లాగిన్ అవ్వండి..!

ట్రెండింగ్ వార్తలు