Oppo K12 Launch : భారీ బ్యాటరీతో ఒప్పో K12 ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

ఈ హ్యాండ్‌సెట్ 3 ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ నెల చివరిలో చైనాలో విక్రయానికి అందుబాటులోకి రానుంది. భారత్‌లో ఆవిష్కరించిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 రీబ్రాండెడ్ వెర్షన్‌గా కనిపిస్తుంది.

Oppo K12 Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌‌ఫోన్ మేకర్ ఒప్పో నుంచి సరికొత్త ఒప్పో K12 ఫోన్ వచ్చేసింది. ఈ ఒప్పో ఫోన్ 12జీబీ వరకు ర్యామ్, 512జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీతో వస్తుంది. ఆక్టా-కోర్ క్వాల్‌‌కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో వస్తుంది. సెంటర్ హోల్-పంచ్ అమోల్డ్ డిస్‌ప్లే, డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 3 ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ నెల చివరిలో చైనాలో విక్రయానికి అందుబాటులోకి రానుంది. ఇటీవల భారత్‌లో ఆవిష్కరించిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 రీబ్రాండెడ్ వెర్షన్‌గా కనిపిస్తుంది.

Read Also : WhatsApp Passkey : ఆపిల్ ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్‌కీ సపోర్టు వచ్చేసింది.. ఎలా సెటప్ చేయాలంటే?

ఒప్పో K12 ధర, లభ్యత :
చైనాలో ఒప్పో K12 ఫోన్ 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర సీఎన్‌వై 1,799 (దాదాపు రూ. 20,700), అయితే 12జీబీ+ 256జీబీ, 12జీబీ+ 512జీబీ వేరియంట్‌లు దాదాపు రూ. 23,900, రూ. 28,700 ధరకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఫోన్ ఒప్పో చైనా స్టోర్ ద్వారా ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. ఏప్రిల్ 29 నుంచి సేల్ విక్రయానికి అందుబాటులో ఉంది. (Qingyun), Starry Night కలర్ ఆప్షన్లలో అందిస్తోంది.

ఒప్పో K12 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఒప్పో K12 ఫోన్ 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (2,412 x 1,080 పిక్సెల్‌లు) అమోల్డ్ డిస్‌ప్లేతో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 240హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2,160హెచ్‌జెడ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ రేట్, 1,100 నిట్ వరకు బ్రైట్‌నెస్ స్థాయిని కలిగి ఉంది. 4ఎన్ఎమ్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ఎస్ఓసీ ద్వారా అడ్రినో 720 జీపీయూతో వస్తుంది. 12జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ కలిగి ఉంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజ్ 1టీబీ వరకు విస్తరించవచ్చు. ఆండ్రాయిడ్ 14-ఆధారిత కలర్ఓఎస్ 14తో ఫోన్ వస్తుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఒప్పో K12 డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ని కలిగి ఉంది. ఇందులో 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 ప్రైమరీ సెన్సార్ ఎఫ్/1.8 ఎపర్చరు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో పాటు 120-డిగ్రీ అల్ట్రాతో 8ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్355 సెన్సార్ ఉంటుంది. ఎఫ్/2.2 ఎపర్చర్‌తో వైడ్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్‌తో పాటు వస్తుంది. ఫ్రంట్ కెమెరా ఎఫ్/2.4 ఎపర్చర్‌తో 16ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉంది.

ఒప్పో 100డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు సపోర్టుతో ఒప్పో K12లో 5,500ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. 5జీ, డ్యూయల్ 4జీ VoLTE, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్,GLONASS, గెలీలియో, క్యూజెడ్‌ఎస్ఎస్, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. దుమ్ము, స్ప్లాష్ నిరోధకతకు ఐపీ54 రేటింగ్‌ను అందిస్తుంది. 162.5ఎమ్ఎమ్ x 75.3ఎమ్ఎమ్ x 8.4ఎమ్ఎమ్ సైజు, 186 గ్రాముల బరువు ఉంటుంది.

Read Also : AC Electricity Bill : ఈ వేసవిలో మీ ఏసీ మరింత కూల్‌గా.. ఇలా చేస్తే.. విద్యుత్ బిల్లుపై డబ్బు ఆదా చేసుకోవచ్చు తెలుసా?

ట్రెండింగ్ వార్తలు