iQoo Z9 Series Launch : భారీ బ్యాటరీతో 3 సరికొత్త ఐక్యూ Z9 సిరీస్ ఫోన్లు.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఐక్యూ Z9ఎక్స్ ఫోన్ 50ఎంపీ ఏఐ యాంటీ-షేక్ లెన్స్, 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్‌లకు 8ఎంపీ కెమెరాను కలిగి ఉంది.

iQoo Z9 Series Launch : ప్రముఖ వివో సబ్-బ్రాండ్ ఐక్యూ కొత్త Z-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఐక్యూ Z9 టర్బో, ఐక్యూ Z9, ఐక్యూ Z9x బుధవారం (ఏప్రిల్ 24) చైనాలో ప్రవేశపెట్టింది. 50ఎంపీ బ్యాక్ కెమెరా సెన్సార్‌తో మల్టీ కలర్ ఆప్షన్లలో వస్తాయి. స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌లపై రన్ అవుతాయి.

Read Also : Reliance Jio : చైనా మొబైల్ కన్నా డేటా ట్రాఫిక్‌లో జియోనే నెం.1.. ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌‌గా అవతరణ!

ఐక్యూ Z9 టర్బో, ఐక్యూ Z9x ఫోన్ 144హెచ్‌జెడ్ వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అయితే, ఐక్యూ Z9x ఫోన్ 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ 3 ఫోన్‌లు 6,000ఎంఎహెచ్ బ్యాటరీలను కలిగి ఉన్నాయి. ఐక్యూ Z9 టర్బో, ఐక్యూ Z9 ఫోన్ 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తున్నాయి. అయితే, ఎంట్రీ-లెవల్ ఐక్యూ Z9x ఫోన్ 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ అందిస్తుంది.

ఐక్యూ Z9 టర్బో, ఐక్యూ Z9, ఐక్యూ Z9x ధర ఎంతంటే? :
ఐక్యూ Z9 టర్బో 12జీబీ+ 256జీబీ మోడల్ ధర సీఎన్‌వై ధర 1,999 (సుమారు రూ. 23వేలు) నుంచి ప్రారంభమవుతుంది. 16జీబీ+ 256జీబీ, 12జీబీ+ 512జీబీ, 16జీబీ+ 512జీబీ ధర సీఎన్‌వై 2,299 (దాదాపు రూ. 26వేలు), సీఎన్‌వై 2,399 (దాదాపు రూ. 28,120), ఐక్యూ Z9 8జీబీ + 128జీబీ మోడల్ ధర సీఎన్‌వై 1,499 (దాదాపు రూ. 17వేలు) నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో, 8జీబీ+256జీబీ సీఎన్‌వై 1,599 (దాదాపు రూ. 18,700), 12జీబీ+ 256జీబీ ధర సీఎన్‌వై 1,799 (రూ. 20వేలు) ఉంటుంది.

12జీబీ + 512జీబీ టాప్-ఎండ్ వేరియంట్ సీఎన్‌వై 1,999 (దాదాపు రూ. 23వేలు)కి అందుబాటులో ఉంది. ఐక్యూ Z9, ఐక్యూ Z9 టర్బో డార్క్ నైట్, మౌంటైన్ గ్రీన్, స్టార్‌బర్స్ట్ వైట్ షేడ్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఐక్యూ Z9x 8జీబీ+ 128జీబీ వెర్షన్ ధర సీఎన్‌వై 1,299 (సుమారు రూ. 15వేలు) నుంచి ప్రారంభమవుతుంది. డార్క్ నైట్, ఫెంగ్ యుకింగ్, స్టార్‌బర్స్ట్ వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ 3 ఫోన్‌లు ప్రస్తుతం చైనాలో విక్రయానికి రెడీగా ఉన్నాయి.

ఐక్యూ Z9 టర్బో, ఐక్యూ Z9 స్పెసిఫికేషన్లు :
డ్యూయల్-సిమ్ (నానో) ఐక్యూ Z9 టర్బో, ఐక్యూ Z9 ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆర్జిన్ఓఎస్ 4పై రన్ అవుతాయి. 144హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఫుల్-హెచ్‌డీ ప్లస్ (1,080×2,400 పిక్సెల్‌లు) అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. హుక్సింగ్ సి8 స్క్రీన్‌లు 91.90 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో అందిస్తాయి.

ఐక్యూ జెడ్9 టర్బో అనేది 16జీబీ ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీతో పాటు స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్‌తో కొత్త లైనప్‌లో అత్యంత ప్రీమియం మోడల్ ఉంటుంది. ఐక్యూ Z9 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ఎస్ఓసీపై రన్ అవుతుంది. గరిష్టంగా 12జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో వస్తుంది.

రెండు మోడల్స్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్, 16ఎంపీ సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంది. ఐక్యూ Z9 టర్బో 50ఎంపీ కొత్త సోనీ ఎల్‌వైటీ-600 సెన్సార్, బ్యాక్ సైడ్ 8ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంది. ఐక్యూ Z9 అదే 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 సెన్సార్‌తో పాటు బ్యాక్ సైడ్ 2ఎంపీ డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఐక్యూ Z9, ఐక్యూ Z9 టర్బో కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, బియిడూ, జీపీఎస్, GLONASS, GALILEO, NFC, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

బోర్డులోని సెన్సార్‌లలో ఇ-కంపాస్, గ్రావిటీ సెన్సార్, లైట్ సెన్సార్, గైరోస్కోప్, ఐఆర్ రిమోట్ కంట్రోల్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటార్, సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్‌లు ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌, ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్‌ను అందిస్తాయి. ఐక్యూ Z9, ఐక్యూ Z9 టర్బో 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,000ఎంఎహెచ్ బ్యాటరీతో సపోర్టు ఇస్తాయి. వనిల్లా మోడల్ కొలతలు 63.72×75.88×7.98ఎమ్ఎమ్, బరువు 194.6 గ్రాములు ఉంటుంది. టర్బో వేరియంట్ కొలతలు 163.72×75.88×7.98ఎమ్ఎమ్, బరువు 194.9 గ్రాములు ఉంటుంది.

ఐక్యూ Z9x స్పెసిఫికేషన్లు :
ఐక్యూ Z9x ఫోన్ అనేది 12జీబీ వరకు (LPDDR4X) ర్యామ్, 256జీబీ వరకు యూఎఫ్ఎస్2.2 స్టోరేజీతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ఎస్ఓసీతో కొత్త సిరీస్‌తో రానుంది.ఐక్యూ Z9, ఐక్యూ Z9 టర్బో మాదిరిగా అదే సిమ్, సాఫ్ట్‌వేర్ స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. (1,080×2,408 పిక్సెల్స్) రిజల్యూషన్, 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల ల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఐక్యూ జెడ్9ఎక్స్ :
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఐక్యూ Z9ఎక్స్ ఫోన్ 50ఎంపీ ఏఐ యాంటీ-షేక్ లెన్స్, 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్‌లకు 8ఎంపీ కెమెరాను కలిగి ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో ఇతర ఐక్యూ Z9 సిరీస్ ఫోన్‌లకు సమానంగా ఉంటాయి. అలాగే సెన్సార్లు కూడా ఉన్నాయి. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కూడా కలిగి ఉంది. ఫేస్ అన్‌లాక్‌కు సపోర్టు ఇస్తుంది. ఐక్యూ Z9ఎక్స్ 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000ఎంఎహెచ్ బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. ఐక్యూ 165x70x7.99ఎమ్ఎమ్, 199 గ్రాముల బరువు ఉంటుంది.

Read Also : JioCinema Premium Plans : జియోసినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు ఇవే.. ప్రారంభ ధర కేవలం రూ. 29 మాత్రమే!

ట్రెండింగ్ వార్తలు