Reliance Jio : చైనా మొబైల్ కన్నా డేటా ట్రాఫిక్‌లో జియోనే నెం.1.. ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌‌గా అవతరణ!

Reliance Jio Data Traffic : మార్చి 2024 నాటికి, జియో ట్రూ5జీ స్టాండలోన్ నెట్‌వర్క్‌లో 108 మిలియన్ల సబ్‌స్క్రైబర్లతో 481.8 మిలియన్ల సబ్‌స్క్రైబర్ బేస్ కలిగి ఉంది. దాంతో భారతీయ టెలికాం మార్కెట్లో జియో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

Reliance Jio : చైనా మొబైల్ కన్నా డేటా ట్రాఫిక్‌లో జియోనే నెం.1.. ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌‌గా అవతరణ!

World's Largest Network Operator in data traffic

Reliance Jio Data Traffic : భారతీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో డేటా ట్రాఫిక్ పరంగా చైనా మొబైల్‌ను అధిగమించి సరికొత్త మైలురాయిని సాధించింది. తద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా జియో అవతరించింది. ఇటీవలే జియో త్రైమాసిక ఫలితాల ప్రకటన సందర్భంగా ఈ అచీవ్‌మెంట్ సాధించింది.

వివిధ విభాగాలలో కంపెనీ వృద్ధిని సాధించింది. మార్చి 2024 నాటికి, జియో ట్రూ5జీ స్టాండలోన్ నెట్‌వర్క్‌లో 108 మిలియన్ల (10.8 కోట్లకు పైగా) సబ్‌స్క్రైబర్లతో 481.8 మిలియన్ల సబ్‌స్క్రైబర్ బేస్ కలిగి ఉంది. ఫలితంగా, భారతీయ టెలికాం మార్కెట్లో జియో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

Read Also : Apple iPhone 13 : కొత్త ఫోన్ కొంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఈ ఐఫోన్ కొనాలా? వద్దా?

28.7జీబీకి పెరిగిన డేటా వినియోగం :
జియో నెట్‌వర్క్‌లో మొత్తం ట్రాఫిక్ 40.9 ఎక్సాబైట్‌లకు చేరుకుంది. 5జీ, హోమ్ సర్వీసుల ద్వారా 35.2 శాతం పెరిగింది. ఇందులో సుమారుగా 28 శాతం ట్రాఫిక్ 5జీ సబ్‌స్క్రైబర్‌ల నుంచే వస్తుంది. నెక్స్ట్ జనరేషన్ కనెక్టివిటీ వైపు వేగవంతమైన డేటా ట్రాఫిక్ సూచిస్తుంది. జియో ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) సర్వీసులు కూడా డేటా ట్రాఫిక్‌కు గణనీయంగా పెరిగేలా దోహదపడ్డాయి.

కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి వార్షిక డేటా ట్రాఫిక్‌లో నాటకీయంగా 2.4ఎక్స్ పెరుగుదల కనిపించింది. తలసరి నెలవారీ డేటా వినియోగం మూడేళ్ల క్రితం కేవలం 13.3జీబీ నుంచి 28.7జీబీకి పెరిగింది. భారత్‌లో డిజిటల్ కనెక్టివిటీపై ఎంతగా ఆధారపడుతున్నారు అనేది డేటా గణాంకాలే సూచిస్తున్నాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. కంపెనీ పనితీరు, భారత ఆర్థిక వ్యవస్థకు సహకారం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పన్నుకు ముందు లాభాల్లో లక్ష కోట్లు దాటిన మొదటి భారతీయ కంపెనీగా రిలయన్స్ సాధించిన విజయాల పట్ల అంబానీ ఆనందం వ్యక్తం చేశారు. 2జీ యూజర్లను స్మార్ట్‌ఫోన్‌లకు అప్‌గ్రేడ్ చేయడం నుంచి ఏఐ ఆధారిత పరిష్కారాలను ఉత్పత్తి చేయడంలో నాయకత్వం వహించడం వరకు జియో పాత్రను అంబానీ కొనియాడారు.

భారత అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా :
రిలయన్స్ రిటైల్, కంపెనీ రిటైల్ విభాగం కూడా బలమైన వృద్ధిని కనబరిచింది. ఫుట్‌ఫాల్స్‌లో 36 శాతం పెరుగుదల కనబర్చింది. భారత గ్యాస్ ఉత్పత్తిలో 30 శాతంగా ఉంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రూ. 20లక్షల కోట్లు దాటి భారత అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా తన స్థానాన్ని పదిలపర్చుకుంది.

మార్చి 2024తో ముగిసిన త్రైమాసికంలో 13 శాతం నికర లాభం రూ. 5,337 కోట్లకు పెరిగిందని నివేదించింది. అదే సమయంలో కంపెనీ ఆదాయం నాల్గవ త్రైమాసికంలో రూ. 25,959 కోట్లు కాగా.. సంవత్సరానికి రూ. 23,394 కోట్ల నుంచి 11 శాతానికి పెరిగింది. ఆసక్తికరంగా, కంపెనీ డేటా ట్రాఫిక్ నాలుగో త్రైమాసికంలో ఏడాదితో పోలిస్తే.. 35.2 శాతం పెరిగింది.

Read Also : Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15పై రూ. 14వేల ఫ్లాట్ డిస్కౌంట్.. అత్యంత సరసమైన ఈ డీల్ ఎలా పొందాలంటే?