Vivo T3x First Sale : వివో T3x 5G ఫోస్ ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. బ్యాంకు ఆఫర్లపై మరింత తగ్గింపు.. ఇప్పుడే కొనేసుకోండి!

వివో T3x 5జీ ఫోన్ ప్రత్యేక ధర రూ. 13,499 వద్ద లాంచ్ అయింది. అయితే బ్యాంక్ ఆఫర్లతో రూ.12,499కే ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

Vivo T3x First Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే, ఇదే బెస్ట్ టైమ్. ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో ఎంట్రీ-లెవల్ ఫోన్ T3x మోడల్ ఫస్ట్ సేల్ మొదలైంది. ప్రస్తుతం భారత మార్కెట్లో వినియోగదారులకు కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ వివో ఫోన్ ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది.

Read Also : Bha Shoe Sizing System : భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్.. ఇదే మన నెంబర్!

ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌తో పనిచేస్తుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. వివో T3x 5జీ ఫోన్ ప్రత్యేక ధర రూ. 13,499 వద్ద లాంచ్ అయింది. అయితే బ్యాంక్ ఆఫర్లతో రూ.12,499కే ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 2 కలర్ ఆప్షన్లలో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ విభాగంలో ఇదే అత్యంత వేగవంతమైన ఫోన్ అని వివో పేర్కొంది.

వివో T3x ధర, లభ్యత :
వివో టీ3ఎక్స్ 5జీ ఫోన్ మొత్తం క్రిస్టల్ గ్రీన్, క్రిమ్సన్ బ్లిస్ అనే 2 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 4జీబీ ర్యామ్, 6జీబీ ర్యామ్, 8జీబీ ర్యామ్ 3 వేరియంట్‌లు ఉండగా, అన్నింటికి స్టోరేజ్ 128జీబీ కలిగి ఉంది. వాస్తవానికి 4జీబీ ర్యామ్ వివో ఫోన్ ధర రూ. 17,499 కాగా, ప్రస్తుతం రూ. 13,499 తగ్గింపు ధరలో అందుబాటులో ఉంది.

మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ లేదా ఎస్‌బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. అదనంగా రూ. వెయ్యి తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్ ధర రూ.12,499కి తగ్గుతుంది. 6జీబీ ర్యామ్ వెర్షన్ ధర రూ.14,999, 8జీబీ ర్యామ్ వెర్షన్ ధర రూ.16,499 ఉంటుంది. ఈ 2 వేరియంట్‌లు కూడా బ్యాంక్ డిస్కౌంట్‌లను పొందుతాయి. తద్వారా తక్కువ ధరలకు పొందవచ్చు. ఈ ఫోన్ కొనుగోలుకు ఏప్రిల్ 24, 2024 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులో ఉంటుంది.

వివో T3x స్పెసిఫికేషన్‌లు :
వివో T3ఎక్స్ 5జీ ఫోన్ 120హెచ్‌జెడ్ హై రిఫ్రెష్ రేట్, 2408 x 1080 పిక్సెల్‌ల ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్‌తో పెద్ద 6.72-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డివైజ్ డిస్‌ప్లే1000 నిట్‌ల ప్రకాశంతో 339పీపీఐ పిక్సెల్ సాంద్రత, 83శాతం ఎన్‌టీపీసీ కలర్ ఆప్షన్ కలిగి ఉంది.

పవర్‌ఫుల్ విజువల్స్‌ కోసం స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ప్రాసెసర్‌తో పాటు అడ్రినో 710 జీపీయూ, కేటగిరీలో వేగవంతమైన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ ఫోన్ సొగసైన డిజైన్‌ను కలిగి ఉంది. 199 గ్రాముల బరువు, 165.70 x 76.0 x 7.99 మి.మీ సైజు ఉంటుంది. వెనుకవైపు వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఎఫ్/1.8 ఎపర్చరుతో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.4 ఎపర్చర్‌తో 2ఎంపీ డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఎఫ్/2.05 ఎపర్చర్‌తో 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.

వివో T3ఎక్స్ 5జీ అద్భుతమైన 6000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 44డబ్ల్యూ ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. యూజర్లు రోజంతా కనెక్ట్ అయ్యేలా చూస్తుంది. అదనంగా, ఈ ఫోన్ స్టాండ్‌బై టైమ్ సూపర్ బ్యాటరీ సేవర్ మోడ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్‌టచ్OS 14పై రన్ అవుతున్న వివో T3ఎక్స్ 5జీ మృదువైన కస్టమైజడ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, ఆకట్టుకునే డిస్‌ప్లే, అధునాతన కెమెరా సామర్థ్యాలతో వివో T3x 5జీ ఫీచర్-ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు.

Read Also : WhatsApp Admins : వాట్సాప్‌లో త్వరలో సరికొత్త ప్రైవసీ ఫీచర్.. ఇక అడ్మిన్లు.. కమ్యూనిటీ లిస్టులో నిర్దిష్ట గ్రూపులను హైడ్ చేయొచ్చు..!

ట్రెండింగ్ వార్తలు