JioCinema Premium Plans : జియోసినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు ఇవే.. ప్రారంభ ధర కేవలం రూ. 29 మాత్రమే!

ఫ్యామిలీ ఆడియోన్స్ కోసం జియోసినిమా కూడా 'ఫ్యామిలీ' ప్లాన్‌ను రూ. 89/నెలకు ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ ఏకకాలంలో 4 స్క్రీన్‌లలో యాక్సెస్‌ పొందవచ్చు.

JioCinema Premium Plans : జియోసినిమా వినియోగదారుల కోసం ‘జియోసినిమా ప్రీమియం’ కొత్త సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ప్రవేశపెట్టింది. డివైజ్ పరిమితులు, వీడియో క్వాలిటీ, ఖరీదైన సబ్‌స్క్రిప్షన్‌ల వంటి సమస్యలను పరిష్కరిస్తూ ప్లాట్‌ఫారమ్ కేవలం నెలకు రూ.29తో ప్రారంభమయ్యే ప్లాన్‌లను ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్‌లు యాడ్ ఫ్రీ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. గరిష్టంగా 4కె వీడియో క్వాలిటీతో పాటు కంటెంట్‌ను ఆఫ్‌లైన్‌లో చూడవచ్చు. మీ స్మార్ట్ టీవీలతో సహా ఏ డివైజ్‌లోనైనా సభ్యులు ప్రత్యేకమైన సిరీస్‌లు, మూవీలు, హాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌లు, పిల్లల షోలు, టీవీ షోలను వీక్షించవచ్చు.

Read Also : Reliance Jio : చైనా మొబైల్ కన్నా డేటా ట్రాఫిక్‌లో జియోనే నెం.1.. ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌‌గా అవతరణ!

ఒకేసారి 4 స్ర్కీన్లలో యాక్సస్ చేయొచ్చు :
అంతేకాదు.. ఫ్యామిలీ ఆడియోన్స్ కోసం జియోసినిమా కూడా ‘ఫ్యామిలీ’ ప్లాన్‌ను రూ. 89/నెలకు ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ ఏకకాలంలో 4 స్క్రీన్‌లలో యాక్సెస్‌ పొందవచ్చు. ప్రస్తుత జియోసినిమా ప్రీమియం సభ్యులు ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా ఆటోమేటిక్‌గా ‘ఫ్యామిలీ’ ప్లాన్‌కి అప్‌గ్రేడ్ అవుతారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో సహా స్పోర్ట్స్ కంటెంట్ యాడ్స్‌తో ఉచితంగా అందిస్తోంది. జియోసినిమా ప్రీమియం స్పెషల్ బెనిఫిట్స్ అందిస్తుంది. ప్రాంతీయ భాషలలో డబ్ చేసిన అత్యుత్తమ అంతర్జాతీయ కంటెంట్‌కు జియోసినిమా మెంబర్స్ యాక్సస్ పొందవచ్చు.

ఇందులో గేమ్ ఆఫ్ థ్రోన్స్, హౌస్ ఆఫ్ ది డ్రాగన్ వంటి పాపులర్ సిరీస్, అలాగే పీకాక్, హెచ్‌బీఓ, పారామౌంట్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ వంటి ప్రముఖ స్టూడియోల నుంచి సినిమాలు ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌లో మోటు పాట్లు, శివ నుంచి పోకీమాన్, పెప్పా పిగ్ వరకు క్యాప్షన్లతో పాటు కిడ్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్ కలెక్షన్స్ అందిస్తుంది. జియోసినిమా పేరంట్స్ కంట్రోల్ ఫీచర్లతో పిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని అందిస్తుంది.

ప్రతినెలా బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ప్రీమియం :
ఒరిజినల్ కంటెంట్, బ్లాక్‌బస్టర్ సినిమాలను ఇష్టపడే వారికి జియోసినిమా ప్రీమియం అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. ప్రతి నెలా కొత్త సిరీస్ ప్రీమియర్‌లను చూడవచ్చు. వచ్చే మేలో జరా హాట్కే జరా బచ్కేతో ప్రారంభమయ్యే ప్రతి నెలా బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ప్రీమియర్‌ని అందించనుంది. జియోసినిమా ప్రీమియం సభ్యులు టీవీలో ప్రసారమయ్యే ముందు సీరియల్‌లతో సహా కలర్స్, నికెలోడియన్, ఇతర వయాకమ్18 నెట్‌వర్క్ ఛానెల్‌ల నుంచి కంటెంట్‌కు ముందస్తు యాక్సెస్‌ను కూడా పొందవచ్చు.

వయాకమ్18 డిజిటల్ సీఈఓ కిరణ్ మణి మాట్లాడుతూ.. జియోసినిమా ప్రీమియంకు సంబంధించి తన విజన్‌ని షేర్ చేశారు. ప్రతి భారతీయ కుటుంబానికి వినోద అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఈ కొత్త సర్వీసును ప్రమోట్ చేసేందుకు జియోసినిమా ‘తో ఆజ్ క్యా ప్లాన్ హై?’ పేరుతో క్యాంపెయిన్ ప్రారంభించింది. జియోసినిమా ప్రీమియం ధరతో పాటు క్వాలిటీని అందిస్తుంది. 4కె స్ట్రీమింగ్, ఆఫ్‌లైన్ వ్యూను అందిస్తుంది. కస్టమర్-ఫ్రెండ్లీ ధరలతో ఎలాంటి డివైజ్ పరిమితులు లేకుండా యాక్సస్ పొందవచ్చు.

ఇతర ఓటీటీల కన్నా ధర తక్కువే :
ప్రస్తుత ధర ప్రకారం.. జియోసినిమా ధర నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో కన్నా తక్కువగా ఉంటుంది. భారత మార్కెట్లో చౌకైన నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ ధర నెలకు రూ. 149 ఉండగా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో రెండూ ఒక నెల సబ్‌స్ర్కిప్షన్ ధర రూ. 299కు పొందవచ్చు. సర్వీస్ వెబ్‌సైట్‌లోని సబ్‌స్క్రిప్షన్ పేజీ జియోసినిమా ప్రీమియం ప్లాన్ ధర ఇప్పుడు ఒక స్క్రీన్‌పై నెలకు రూ. 29, అదే 4 స్క్రీన్‌ల ‘ఫ్యామిలీ’ సబ్‌స్క్రిప్షన్ ధర రూ. 89కు అందిస్తోంది. జియోసినిమా రెండు ప్రీమియం ప్లాన్‌లు వ్యక్తిగత, ఫ్యామిలీ ప్లాన్‌లకు వరుసగా నెలకు రూ. 149, రూ. 59కు పొందవచ్చు.

జియోసినిమా ప్రీమియం గతంలో వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ మాత్రమే ఉండేది. ఈ ప్లాన్ ధర రూ. 999గా ఉంది. ఈ ప్లాన్ ఇకపై స్ట్రీమింగ్ సర్వీస్ వెబ్‌సైట్‌లో ఉండదు. కస్టమర్‌లు నెలవారీ ప్లాన్‌ను ఎంచుకోవలసి ఉంటుంది. వ్యక్తిగత జియోసినిమా ప్రీమియం ప్లాన్ ధర రూ. 348, పాత ప్లాన్ కన్నా చాలా తక్కువనే చెప్పాలి. ‘ఫ్యామిలీ’ ప్లాన్ ఒక ఏడాదికి రూ. 1,068కు పొందవచ్చు.

Read Also : JioCinema Subscription Plan : ఈ నెల 25న జియోసినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ వచ్చేస్తోంది.. ఐపీఎల్‌కు చెల్లించాల్సిందేనా!

ట్రెండింగ్ వార్తలు