JioCinema Subscription Plan : ఈ నెల 25న జియోసినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ వచ్చేస్తోంది.. ఐపీఎల్‌కు చెల్లించాల్సిందేనా!

ఈ ప్లాన్‌ ద్వారా ప్లాట్‌ఫారమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వీక్షించేందుకు యూజర్ల నుంచి ఫీజు వసూలు చేయనుందా? లేదా అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

JioCinema Subscription Plan : ఈ నెల 25న జియోసినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ వచ్చేస్తోంది.. ఐపీఎల్‌కు చెల్లించాల్సిందేనా!

JioCinema will announce new subscription plan on April 25

JioCinema Subscription Plan : మోస్ట్ పాపులర్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన జియోసినిమా తమ యూజర్ల కోసం కొత్త సబ్‌స్క్రిప్షన్‌ను ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్ రాకను కంపెనీ ప్రకటించింది. వినియోగదారులకు యాడ్ ప్రీ ఎక్స్‌పీరియన్స్ అందించనుందని వీడియోలో పేర్కొంది. ఈ ప్లాన్‌ ద్వారా ప్లాట్‌ఫారమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వీక్షించేందుకు యూజర్ల నుంచి ఫీజు వసూలు చేయనుందా? లేదా అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Reliance Jewels : అక్షయ తృతీయ వేడుకలు.. రిలయన్స్ జ్యువెల్స్ ‘వింధ్య కలెక్షన్’ ఆవిష్కరించిన దిశా పటానీ

ఏప్రిల్ 25న కొత్త యాడ్ ప్రీ-సబ్‌స్ర్కిప్షన్ :
జియోసినిమాలో ఒక షార్ట్ వీడియోను రిలీజ్ చేసింది. వీడియోల మధ్య యాడ్స్‌తో యూజర్లు విసిగిపోయారని సూచిస్తుంది. ఇప్పుడు, ఏప్రిల్ 25న కొత్త యాడ్-ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. అందులో ఒక యాడ్ ఫ్యామిలీ ప్లాన్ గురించి కూడా సూచించింది. అయితే, కంపెనీ ఇతర వివరాలను వెల్లడించలేదు. ఐపీఎల్ మ్యాచ్‌లు చాలా యాడ్స్ కలిగి ఉంటాయి. కంపెనీ యాడ్ ప్రీ ప్లాన్‌ను కూడా ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. జియోసినిమా ఐపీఎల్ వీక్షించడానికి ఛార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

యాడ్స్‌తో ఉచితంగా ఐపీఎల్ చూడొచ్చు :
ప్రస్తుతం, ప్లాట్‌ఫారమ్ యూజర్లు ఐపీఎల్‌ని ఉచితంగా వీక్షించేందుకు అనుమతిస్తుంది. అయినప్పటికీ, యూజర్లు యాడ్స్ కూడా చూడాల్సిందే. కానీ, రాబోయే సబ్‌స్క్రిప్షన్‌తో ఇది మారవచ్చు. ఎందుకంటే.. ఈ ప్లాన్ యాడ్-ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే, ఐపీఎల్ కోసం కూడా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి, అధికారికంగా దీనిపై ధృవీకరించలేదు. రాబోయే రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. కొత్త జియోసినిమా ప్లాన్ 4Kలో కంటెంట్‌ని వీక్షించేందుకు డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుందని నివేదిక సూచిస్తుంది.

జియోసినిమాలో రెండు ప్లాన్లు ఇవే :
ప్రస్తుతం, జియోసినిమా 2 ప్లాన్‌లను కలిగి ఉంది. అందులో వార్షిక సబ్‌స్క్రిప్షన్ రూ. 999, నెలవారీ ప్యాక్ రూ. 99గా ఉంది. పేమెంట్ చేసిన కూడా ప్రీమియం యూజర్ అయినప్పటికీ పూర్తిగా యాడ్ ఫ్రీ కాదని గమనించాలి. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో పిల్లల ఎంటర్‌టైన్మెంట్ కంటెంట్‌ను పెంచడానికి జియోసినిమా పోకీమాన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇటీవల రాయిటర్స్ నివేదించింది.

నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి ప్రత్యర్థి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు పోటీగా ప్లాట్‌ఫారమ్‌లో కంటెంట్‌ను పెంచేలా జియోసినిమా డీల్ సెట్ చేసింది. జియోసినిమా స్ట్రీమింగ్ యాప్‌ను వెయ్యి కన్నా ఎక్కువ ఎపిసోడ్‌లు, జపనీస్ అనిమే సిరీస్‌లోని దాదాపు 20 సినిమాలకు ప్రత్యేక భారత ప్లాట్‌ఫారమ్ పార్టనర్ చేస్తూ ఈ నెలలో ఒప్పందం కుదిరింది.

Read Also : WhatsApp Users : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఫొటోలు, ఫైల్స్ పంపేందుకు ఇంటర్నెట్‌తో పనిలేదు..!