AC Electricity Bill : ఈ వేసవిలో మీ ఏసీ మరింత కూల్‌గా.. ఇలా చేస్తే.. విద్యుత్ బిల్లుపై డబ్బు ఆదా చేసుకోవచ్చు తెలుసా?

AC Electricity Bill : మీ ఇంట్లో ఏసీ ఉందా? అదేపనిగా ఏసీ ఆన్ చేస్తుంటే భారీ విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. కానీ, ఈ సింపుల్ టిప్స్ ద్వారా ఏసీ కూలింగ్ మాత్రమే కాదు.. విద్యుత్ బిల్లులను ఆదా చేసుకోవచ్చు.

AC Electricity Bill : సమ్మర్ సీజన్‌లో ఎండలు భగభగమని మండిపోతున్నాయి. వాతావరణం వేడిగా మారిపోయింది. వేడి వాతావరణం అంటే.. వేడి నుంచి మనలను రక్షించడానికి ఎయిర్ కండిషనర్లు రక్షణగా ఉంటాయి. అయితే, ఏసీలు ఇంటిని చల్లబరుస్తాయి. కానీ, ఏసీలు గంటలు కొద్ది ఆన్ చేయడం ద్వారా నెలవారీ విద్యుత్ బిల్లుతో మన జేబులు ఖాళీ అవుతాయి.

Read Also : iQoo Z9 Series Launch : భారీ బ్యాటరీతో 3 సరికొత్త ఐక్యూ Z9 సిరీస్ ఫోన్లు.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

అందులోనూ వచ్చే మే నాటికి మరింత వేడిగా ఉండనుంది. ఈ నెలలో ఎక్కువ ఏసీ వినియోగం తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో ఏసీల వినియోగంతో విద్యుత్ బిల్లులను ఎలా ఆదా చేయవచ్చు? దీనికి ఏసీ స్విచ్ ఆఫ్ చేయడం పరిష్కారం కాదు. కూలింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మీ ఎయిర్ కండీషనర్ సామర్థ్యాన్ని పెంచడానికి విద్యుత్ ఖర్చులను ఆదా చేయడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.

18°Cకి బదులుగా 24°C టెంపరేచర్ సెట్ చేయండి :
థర్మోస్టాట్‌ను ఒక డిగ్రీ పెంచడం వల్ల విద్యుత్ ఖర్చులపై దాదాపు 6శాతం ఆదా అవుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మీ ఏసీని 24°C వద్ద ఉంచడం ద్వారా విద్యుత్‌ను తక్కువగా సెట్ చేయడంతో పోలిస్తే.. 24శాతం వరకు ఆదా చేయవచ్చు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE)కి ఇప్పుడు ఏసీ తయారీదారులు తమ డివైజ్‌‌ల డిఫాల్ట్ ఉష్ణోగ్రత 20°C నుంచి 24°Cకి సెట్ చేయాల్సి ఉంటుంది.

ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు వంటి అధిక ఉష్ణోగ్రతలు ఉన్న నగరాల్లో మీ ఏసీని దాదాపు 23-24°Cకి సెట్ చేయాలి. మన శరీర ఉష్ణోగ్రత 36 నుంచి 37°C మధ్య ఉంటుంది. ఆ టెంపరేచర్ మధ్య ఉన్న ఏ గది అయినా సహజంగా కూల్‌గానే ఉంటుంది. మీ గదిని మరింత కూల్‌గా మార్చడానికి బదులుగా నిద్రించడానికి తగినంత టెంపరేచర్ ఉంచుకోండి.

రూమ్స్ సీల్ చేయండి :
సరైన కూలింగ్ కోసం.. మీ ఇంటి గదులను పూర్తిగా మూసివేయాలి. చల్లని గాలి బయటకు రాకుండా అన్ని కిటికీలు గట్టిగా మూసివేయాలి. సూర్యరశ్మితో పాటు వేడిని నిరోధించడానికి కిటికీలపై కర్టెన్లు లేదా బ్లైండ్‌లను వాడండి. లేదంటే.. మీ ఎయిర్ కండీషనర్‌పై మరింత భారం పెరుగుతుంది. ఏవైనా గుంటలు లేదా నాళాలు సరిగ్గా సీలు చేయాలి. చల్లటి గాలిని సమానంగా గదుల్లోకి ప్రసరింప చేస్తుందో లేదో చెక్ చేయండి.

టైమర్‌ని సెట్ చేయండి :
విద్యుత్ ఆదా కోసం మీ ఎయిర్ కండీషనర్ టైమర్‌ను సెట్ చేయండి. అవసరమైన మాన్యువల్‌గా ఎడ్జెస్ట్ చేయండి. ఏసీని అప్పుడప్పుడు ఆన్ చేయడం వల్ల విద్యుత్ ఖర్చు కాకుండా నివారించవచ్చు. పవర్ ఆదా చేయడమే కాకుండా ఓవర్‌కూలింగ్‌ను నిరోధిస్తుంది. రాత్రంతా ఏసీ రన్ అయితే చలిగా అనిపిస్తే.. తక్కువ టైమ్ సెట్ చేసుకోవచ్చు.

రెగ్యులర్ మెయింట్‌నెన్స్ షెడ్యూల్ చేయండి :
మీ ఏసీని రెగ్యులూర్ మెయింట్‌‌నెస్స్ షెడ్యూల్ చేస్తుండాలి. ఏసీ ఫిల్టర్‌లను క్లీన్ చేయడం లేదా కొత్తవి రిప్లేస్ చేయడం వల్ల గాలి ప్రవాహంతో పాటు కూలింగ్ పనితీరు మెరుగుపడుతుంది. రిఫ్రిజెరాంట్ లీక్‌లు లేదా మీ ఏసీ పనితీరుకు ఆటంకం కలిగించే ఇతర సమస్యలను చెక్ చేస్తుండాలి. ఇన్సులేషన్ కావలసిన టెంపరేచర్ మేనేజ్ చేయడం ద్వారా పవర్ ఆదా చేయొచ్చు. మీ ఎయిర్ కండీషనర్‌ను మంచి వర్కింగ్ కండిషన్‌లో ఉంచడం ద్వారా పవర్ వినియోగాన్ని తగ్గించవచ్చు. అంతేకాదు.. యుటిలిటీ బిల్లులను కూడా తగ్గించవచ్చు. మీ ఏసీ లైఫ్ టైమ్ కూడా పెంచుకోవచ్చు.

మీ ఫ్యాన్స్ ఆన్ చేయండి :
మీ ఇంట్లో ఏసీ మరింత కూల్ అవ్వాలంటే ఫ్యాన్స్ ఆన్ చేసి ఉంచండి. ఫ్యాన్లు చల్లటి గాలిని ప్రసరింపజేయడంలో సాయపడతాయి. దాంతో ఏసీ టెంపరేచర్ కొంచెం ఎక్కువగా సెట్ చేసుకోవచ్చు. ఏసీ, ఫ్యాన్‌లు రెండింటినీ ఆన్ చేయడం వల్ల పవర్ ఆదా చేయవచ్చు. దాంతో ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు.

Read Also : WhatsApp Passkey : ఆపిల్ ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్‌కీ సపోర్టు వచ్చేసింది.. ఎలా సెటప్ చేయాలంటే?

ట్రెండింగ్ వార్తలు