Apple to finally launch iPhone 16 with no physical button design
Apple iPhone 16 : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ అతి త్వరలో రాబోతోంది. ఐఫోన్ అభిమానుల కోసం ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ రిలీజ్ చేసేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, నెక్స్ట్ జనరేషన్ 2024 ఐఫోన్‌లు నో-బటన్ డిజైన్‌తో వస్తాయని గతంలోనే పుకార్లు వచ్చాయి.
తైవానీస్ సరఫరాదారు అడ్వాన్స్‌డ్ సెమీకండక్టర్ ఇంజినీరింగ్ నుంచి కెపాసిటివ్ బటన్ కాంపోనెంట్‌ల ఆర్డర్‌ను ఆపిల్ పొందిందని ఆసియా ఎకనామిక్ డైలీ న్యూస్ నివేదిక పేర్కొంది. రాబోయే ఐఫోన్ 16లో ఫిజికల్ బటన్ ఉండకపోవచ్చునని తాజా లీక్ డేటా సూచిస్తోంది.
హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ టెక్నాలజీతో కెపాసిటివ్ వెర్షన్‌లతో ఐఫోన్ ట్రేడేషనల్ ఫిజికల్ బటన్‌లను కలిగి ఉంది. ట్యాప్టిక్ ఇంజిన్ మోటార్ వైబ్రేషన్‌ల ద్వారా ఫిజికల్ బటన్‌ను అందించింది. ఐఫోన్ 16 లైనప్‌లో కెపాసిటివ్ కాంపోనెంట్‌లకు ఆపిల్ ఫార్వర్డ్-లుకింగ్ ప్రొడక్షన్ స్ట్రాటజీలో భాగం కావచ్చు.
అయితే, ఐఫోన్ ప్రో మోడల్‌లలో మ్యూట్ స్విచ్ స్థానంలో కొత్త మెకానికల్ యాక్షన్ బటన్ ప్రవేశపెట్టింది. ఐఫోన్ 16 కెపాసిటివ్ బటన్ భాగాలు 2024 మూడవ త్రైమాసికంలో ఉత్పత్తిలోకి ప్రవేశిస్తాయని నివేదిక పేర్కొంది. అయితే, కొంతమంది విశ్లేషకులు ఈ విషయంలో సందేహాన్ని వ్యక్తం చేశారు. 2025లో ఐఫోన్ 17లో కెపాసిటివ్ బటన్‌లను అందించవచ్చునని నివేదిక పేర్కొంది.
హాప్టిక్ పవర్, వాల్యూమ్ బటన్లు :
మ్యాక్‌రుమర్స్ నివేదిక ప్రకారం.. ఐఫోన్ 16 హాప్టిక్ పవర్, వాల్యూమ్ బటన్‌లతో రానుంది. అంతేకాకుండా, ఐఫోన్ 16 మోడల్‌లు మెకానికల్ బటన్‌లను కలిగి ఉండవచ్చని మునుపటి లీక్‌లు సూచిస్తున్నాయి. కెమెరా ఫంక్షనాలిటీలకు నాల్గో బటన్ ‘క్యాప్చర్ బటన్’గా సూచిస్తారు. ఈ ఫీచర్ ఫోటో, వీడియో-క్యాప్చరింగ్ సామర్థ్యాలను అందిస్తుంది. ఐఫోన్ 16 సిరీస్ ప్రతి ఏడాది మాదిరిగానే సెప్టెంబర్‌లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.
Read Also : itel S24 AI Phone : ఐటెల్ నుంచి 108ఎంపీ భారీ కెమెరాతో ఏఐ పవర్డ్ S24 ఫోన్.. ధర రూ.10వేల లోపు మాత్రమే!