Xiaomi AR Glasses : డబుల్ కెమెరా సెటప్, OLED స్క్రీన్‌తో కొత్త స్మార్ట్ గ్లాసెస్.. ధర ఎంతంటే?

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) నుంచి కొత్త పెయిర్ ఒక కొత్త జత స్మార్ట్ గ్లాసెస్‌ (AR Glasses)ను లాంచ్ చేసింది.

Xiaomi AR Glasses : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) నుంచి కొత్త పెయిర్ ఒక కొత్త జత స్మార్ట్ గ్లాసెస్‌ (AR Glasses)ను లాంచ్ చేసింది. 2021లో ఫస్ట్ శాంపిల్ లాంచ్ చేయగా.. మరో కొత్త ప్రొడక్ట్ రెడీగా ఉంది. చైనాలో మొట్టమొదటి Mijia AR గ్లాసెస్ కెమెరాను CNY 2,499కి లాంచ్ చేసింది. భారత మార్కెట్లో దీని ధర దాదాపు రూ. 29,030గా ఉండనుంది. గ్లోబల్ లాంచ్ కు సంబంధించి షావోమీ ఎలాంటి ప్రకటన చేయలేదు. భారత మార్కెట్లోకి వస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు. Xiaomi స్వదేశంలో విస్తృత శ్రేణి ప్రొడక్టులను విక్రయిస్తుంది. అవన్నీ భారతీయ మార్కెట్‌లోకి ఎంట్రీ లేదు. దాంతో షావోమీ కొన్నింటిని మాత్రమే భారత మార్కెట్లో ప్రకటించింది. లేటెస్టుగా Mijia Glasses కెమెరా ప్రస్తుతం Xiaomi క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫారమ్, Youpin ద్వారా ప్రీ-ఆర్డర్ చేసుకునే వీలుంది. Xiaomi భారత మార్కెట్లో కూడా క్రౌడ్ ఫండింగ్ ప్రాతిపదికన ప్రొడక్టులను అందించింది. అతి త్వరలో ఈ బ్రాండ్ అందుబాటులోకి తీసుకురానుంది.

Xiaomi launches AR glasses with dual camera setup and OLED screen

ఫీచర్ల విషయానికొస్తే.. ఈ స్మార్ట్ గ్లాసెస్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50-MP ఆడ్ బేయర్ ఫోర్-ఇన్-వన్ వైడ్ యాంగిల్ కెమెరా, స్ప్లిట్ OIS ఆప్టికల్ స్టెబిలైజేషన్‌తో కూడిన 8-MP పెరిస్కోపిక్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. 5X ఆప్టికల్ జూమ్‌కు 15x హైబ్రిడ్ జూమ్‌కు కూడా సపోర్టు అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ డివైజ్ ఫోటోలలో చాలా పెద్దదిగా కనిపిస్తున్నప్పటికీ.. గ్లాసెస్ కేవలం 100 గ్రాముల బరువు మాత్రమేనని కంపెనీ స్పష్టం చేసింది. అంతేకాదు.. డివైజ్ చాలా తేలికైనదిగా ఉంటుంది. అలాగే కొంత సమయం వరకు యూజర్ ధరించినా ఎక్కువ సమస్య ఉండదనే చెప్పాలి. కంపెనీ మిజియా యాప్ ద్వారా స్మార్ట్ గ్లాసెస్‌ని కంట్రోల్ చేయవచ్చు.

ఈ యాప్ సాయంతో యూజర్లు ఫోన్‌కి ఫోటోలను త్వరగా ఇంపోర్ట్ చేసి షేర్ చేసుకోవచ్చు. ఈ డివైజ్‌తో 100 నిమిషాల వీడియోను రికార్డ్ చేయవచ్చు. స్నాప్‌డ్రాగన్ 8 చిప్‌సెట్‌తో ఆధారితమైనది. 3GB RAM, 32GB స్టోరేజీ అందిస్తుంది. ఈ డివైజ్ 3,000nits, 3281ppi సాంద్రతతో OLED స్క్రీన్‌తో వచ్చింది. బ్లూ లైట్ స్థాయిలకు TUV ధృవీకరణను కూడా అందిస్తోంది. Xiaomi నుంచి కొత్త స్మార్ట్ గ్లాసెస్ 10W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో1,020mAh బ్యాటరీని అందిస్తుంది. Xiaomi 30 నిమిషాల ఛార్జింగ్‌తో బ్యాటరీని సున్నా నుంచి 80 శాతం వరకు టాప్ అప్ చేయవచ్చు. ఇతర ఫీచర్లు స్క్రీన్‌పై లైవ్ ట్రాన్సలేషన్, డిజిటల్ అసిస్టెంట్‌కు సపోర్టు అందిస్తుంది.

Read Also : Xiaomi Smart Speaker : IR కంట్రోల్‌తో షావోవీ స్మార్ట్ స్పీకర్.. ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు