Congress Second List : జూబ్లీహిల్స్ నుంచి అజారుద్దీన్, ఎల్బీనగర్ నుంచి మధుయాష్కీ గౌడ్.. 45మందితో తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితా విడుదల, పెండింగ్‌లో 19 సీట్లు

ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పరకాల నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. Telangana Congress Second List

Telangana Congress Second List

Telangana Congress Second List : తెలంగాణ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ రిలీజ్ అయ్యింది. 45 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో జాబితాను ప్రకటించింది. హుజురాబాద్ నుంచి వడితల ప్రణవ్, సిద్ధిపేట నుంచి పూజల హరికృష్ణ, మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పరకాల నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఖైరతాబాద్ నుంచి పి.విజయారెడ్డి, చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం, ఎల్బీ నగర్ నుంచి మధుయాష్కీ, జూబ్లీహిల్స్ నుంచి అజారుద్దీన్ బరిలోకి దిగుతున్నారు. కాగా, మరో 19 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను పెండింగ్ లో ఉంచింది కాంగ్రెస్ హైకమాండ్.

కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ లో ఖమ్మం జిల్లాకి మూడు సీట్లు ఖరారయ్యాయి. ఇప్పటివరకు మొత్తం ఐదు సీట్లు ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. మరో ఐదు నియోజకవర్గాలలో‌ సీటు ఎవరికి వస్తుందో అంటూ ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

పాలేరు – పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి
ఖమ్మం – తుమ్మల నాగేశ్వరావు
పినపాక – పాయం వెంకటేశ్వర్లు

Also Read : బీఆర్ఎస్ పై గెలుపు కోసం కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలు.. గులాబీ ముఖ్య నేతలపై హస్తం సీనియర్ నేతలు పోటీ?

కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ హైలైట్స్..
* గద్దర్‌ కుమార్తె వెన్నెలకు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ సీటు
* జూబ్లీహిల్స్‌ నుంచి మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌కు అవకాశం
* జూబ్లీహిల్స్‌లో పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డికి నిరాశ
* ఖైరతాబాద్ నుంచి పీజేఆర్ కూతురు విజయారెడ్డికి అవకాశం
* ఖమ్మం నుంచి తుమ్మల, పాలేరు నుంచి పొంగులేటి పోటీ
* ఎల్బీనగర్‌ నుంచి మధుయాష్కీగౌడ్‌కు ఛాన్స్
* మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
* రెండో జాబితాలో NSUI ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్‌కు దక్కని సీటు

కాంగ్రెస్ అభ్యర్థులు ప్రకటించని 19 సెగ్మెంట్లు ఇవే..
1. వైరా
2. కొత్తగూడెం
3. మిర్యాలగూడ
4. చెన్నూరు
5. చార్మినార్
6. నిజామాబాద్ అర్బన్
7. కామారెడ్డి
8. సిరిసిల్ల
9. సూర్యాపేట
10. తుంగతుర్తి
11. బాన్సువాడ
12. జుక్కల్
13. పఠాన్ చెరు
14. కరీంనగర్
15. ఇల్లందు
16. డోర్నకల్
17. సత్తుపల్లి
18. నారాయణ్ ఖేడ్
19. అశ్వారావుపేట

Also Read : పెద్దపల్లి నియోజవకర్గంలో ఆ రికార్డును సాధిస్తారా?

Telangana Congress Second List Released

ట్రెండింగ్ వార్తలు