Kavitha : కేసీఆర్ పై ఎవరు పోటీ చేసినా ఓటమి ఖాయం : ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ కు ఎన్నికలు ఓ ఆటని వెల్లడించారు. మైనార్టీలను కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గా చూస్తోందని ఆరోపించారు.

MLC Kavitha (1)

Kavitha comments congress : కేసీఆర్ పై అమాయకత్వంతో పోటీ చేయాలనుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ పై ఎవరు పోటీ చేసినా ఓటమి ఖాయమని తెలిపారు. ఒక్క కేసీఆర్ ను కొట్టడానికి ఎన్ని సమీకరణాలు మారుతున్నాయో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. రైతులు, మహిళలను ఇబ్బందులు పెట్టాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. మీడియా ప్రతినిధులతో కవిత గురువారం చిట్ చాట్  చేశారు.

మైనార్టీల ఓట్లు డివైడ్ కావడం వల్ల ప్రజలకు నష్టం కలుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ కు ఎన్నికలు ఓ ఆటని వెల్లడించారు. మైనార్టీలను కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గా చూస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ సెంచరీ కొట్టడం ఖాయం అన్నారు. రైతు బంధు ఆపాలని కాంగ్రెస్ రైతులకు దూరం అయ్యిందన్నారు. నిజాలు చెబుతూ ప్రచారంలో తాము ముందున్నామని తెలిపారు.

Also Read : కాంగ్రెస్ రద్దుల పార్టీ .. అందుకే రైతుబంధు నిలిపివేయాలని ఫిర్యాదు : మంత్రి జగదీష్ రెడ్డి

మా పథకాలు కాపీ కొట్టి కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అంటోంది..

కాంగ్రెస్, బీజేపీ తరహాలో అబద్ధాలు చెప్పడం మాకు రాదని చెప్పారు. కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ నిలిపి వేశామని, కొందరు కావాలని రైతులను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. పథకాల సృష్టికర్త కేసీఆర్ అని కొనియాడారు. తమ పథకాలు కాపీ కొట్టి కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అంటోందని ఎద్దేవా చేశారు.

గాంధీలకు గ్యారెంటీ లేదని, వాళ్ళ గ్యారెంటీలను ప్రజలు నమ్మబోరని తెలిపారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ గొడ్డలిపెట్టు అన్నారు. తమది బీసీల ప్రభుత్వమని చెప్పారు. రాజగోపాల్ ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. కోరుట్లలో ఎంపీ అర్వింద్ ను ఓడిస్తామని శపథం చేశారు. బీజేపీకి తెలంగాణలో స్కోప్ లేదని, ప్రజల్లో ఆ పార్టీకి విశ్వసనీయత లేదన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు