Bellaiah Naik Tejavath : రోడ్డుపై నగ్నంగా మహిళలు.. ఇది కేంద్రం వైఫల్యమే, ఆయన చేసే డ్రామా చూస్తే బ్రహ్మానందం కూడా నవ్వుకుంటారు -బెల్లయ్య నాయక్

రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు శాంతిని నెలకొల్పారు. అసలు బీజేపీ సర్కార్ ఏం చెయ్యాలనుకుంటోంది? మహిళలను నగ్నంగా ఉరేగిస్తున్నారు. (Bellaiah Naik Tejavath)

Bellaiah Naik – Manipur Incident: మణిపూర్ లో ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు.. నగ్నంగా రోడ్డుపై ఊరేగించిన ఘటన యావత్ దేశంలో తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై రాజకీయ పార్టీలు భగ్గుమంటున్నాయి. మణిపూర్ లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, దీనికి కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే అని మండిపడుతున్నాయి. తాజాగా మణిపూర్ లో వెలుగుచూసిన అమానుష ఘటనపై ఏఐసీసీ జాతీయ ఆదివాసీ సెల్ వైస్ ప్రెసిడెంట్ బెల్లయ్య నాయక్ తీవ్రంగా స్పందించారు. మహిళలను నగ్నంగా రోడ్డుపై తీసుకెళ్లడం దారుణం అన్న ఆయన.. ఇది పూర్తిగా కేంద్రం వైఫల్యమే అని మండిపడ్డారు.

”85 రోజులుగా మణిపూర్ మండుతోంది. కేంద్ర ప్రభుత్వం చేతగానితనానికి మణిపూర్ నిదర్శనం. చాలామంది గిరిజనులు మణిపూర్ వదిలిపోయారు. కుకీ , మైతీ తెగల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. మైతేయి తెగను ఎస్టీలో కలపాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అక్కడ బీజేపీ సర్కార్ ఏర్పాటైనప్పటి నుంచి తెగల మధ్య కొట్లాటలు, చర్చిల మధ్య కొట్లాటలు అవుతున్నాయి. కుకీ తెగ అసంతృప్తితో రగులుతోంది.

Also Read..MANIPUR: ఈ ఒకే ఒక్క వదంతి వల్ల.. ఆ ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించారు.. ఇప్పుడు యావత్ భారత్ రగిలిపోతోంది..

12మంది బీజేపీ ఎమ్మెల్యేలు రాజీమానా చేస్తూ.. బీజేపీ డైరెక్షన్ లో ఆందోళన జరుగుతోంది. ఇప్పటికే 350మంది ప్రజలను చంపేశారు. మహిళలను నగ్నంగా రోడ్డుపై తిప్పుతున్నారు. ప్రధాని ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ ఇప్పుడేమో బాధాకరం అంటున్నారు. మణిపూర్ లో గెలవడానికి ఇది ప్రధాని అనుసరించిన వ్యూహం.

రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు శాంతిని నెలకొల్పారు. అసలు బీజేపీ సర్కార్ ఏం చెయ్యాలనుకుంటోంది? మహిళలను నగ్నంగా ఉరేగిస్తున్నారు. ఇది ముమ్మాటికీ కేంద్రం వైఫల్యమే. రెండు జాతుల మధ్య పోరు పెట్టారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మణిపూర్ అమానుష ఘటన గురించి మాట్లాడకుండా డ్రామా చేస్తున్నారు. కిషన్ రెడ్డి చేసే డ్రామా చూస్తే.. బ్రహ్మానందం కూడా నవ్వుకుంటారు.

Also Read..Manipur Violence: మణిపూర్‌లో ఇంత జరుగుతున్నా రాష్ట్రపతి పాలన ఎందుకు విధించడం లేదు?

కేంద్రమంత్రిని పోలీసులు అరెస్ట్ చేస్తారా? అంతా డ్రామానే. బండి సంజయ్ కి క్రెడిట్ పోతుందని కిషన్ రెడ్డి అరెస్ట్ చేయించుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు పోటీ పడి పని చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా. అవసరమైతే కవితను అరెస్ట్ చేస్తారు. కేసీఆర్ పైనా బీజేపీ కేసు పెట్టే ఛాన్స్ ఉంది. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి” అని డిమాండ్ చేశారు బెల్లయ్య నాయక్.

ట్రెండింగ్ వార్తలు