ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అమానుల్లా ఖాన్ హల్‌చల్.. అధికారిపై దాడి.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు

khairatabad transport office: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు రవాణా శాఖ సిబ్బంది..

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అమానుల్లా ఖాన్ హల్‌చల్ చేశారు. అక్కడికి వచ్చి రెచ్చిపోయి.. జాయింట్ ట్రాన్సిస్టర్ కమీషనర్ రమేశ్‌పై దాడికి పాల్పడ్డాడు. రమేశ్ చాంబర్‌లోకి చొరబడి మరీ దాడి చేశాడు.

గాయపడిన రమేశ్‌ను అక్కడి సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అమానుల్లా ఖాన్ దాడిపూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది ఫిర్యాదు చేశారు. గతంలోనూ అమానుల్లా ఖాన్ ఆర్టీవో మానిక్ ప్రభుపై దాడి చేశాడు. మానిక్ ప్రభు చెంపచెళ్లుమనిపించాడు అమానుల్లా ఖాన్. అంతేకాదు, ఆర్టీవో వెంకటేశ్వర్లుపై కూడా దౌర్జన్యానికి పాల్పడ్డాడు. పరుషపదజాలంలో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులపై దాడికి పాల్పడ్డాడు.

ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ వద్ద రవాణా శాఖ ఉద్యోగులు ధర్నాకు దిగారు. రవాణా శాఖ అధికారిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆటో యూనియన్ నాయకుడిపై ఖైరతాబాద్ పీఎస్ లోనూ రమేశ్ పిర్యాదు చేశారు. దాడి ఘటనను రవాణా శాఖ అధికారులు, సిబ్బంది సీరియస్ గా తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్మెంట్ కార్యాలయాల్లో శుక్రవారం నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.

Also Read: వైసీపీ కార్యాలయాల కూల్చివేతల కేసు.. తీర్పు రిజర్వ్

ట్రెండింగ్ వార్తలు