Bandi Sanjay : రమేష్ రాథోడ్ చనిపోయారంటే నమ్మలేకపోతున్నా.. బండి సంజయ్
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి పట్ల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.
- Thota Vamshi Kumar
- Published On : June 29, 2024 / 01:41 PM IST
Bandi Sanjay Pays Tribute to Ramesh rathod
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి పట్ల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. అదిలాబాద్ ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా రమేష్ రాథోడ్ అందించిన సేవలు మరువలేనివి అని అన్నారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి రమేష్ రాథోడ్ ఎంతో కృషి చేశారన్నారు. రమేష్ రాథోడ్ చనిపోయారంటే నమ్మలేకపోతున్నానని చెప్పారు. రమేష్ రాథోడ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాథోడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
శుక్రవారం అర్థరాత్రి ఉట్నూరులోని తన నివాసంలో రమేష్‌రాథోడ్ తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరంచారు. మెరుగైన వైద్యం అందించేందుకు ఆయన్ను హైదరాబాద్‌కు తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారు. రమేష్ రాథోడ్ ఒకసారి జడ్పీ చైర్మన్ గా, ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా పనిచేశారు. ఆయన మృతి పలువురు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
