T20 World Cup Final : జయహో భారత్.. ప్రపంచ ఛాంపియన్ రోహిత్ సేనకు అభినందనల వెల్లువ..

ICC T20 World Cup : ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన రోహిత్‌సేనకు ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

T20 World Cup Final : టీ20 ప్రపంచకప్ కైవసం చేసుకోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా తదితరులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

టీమిండియాను చూసి గర్విస్తున్నాం : ప్రధాని మోదీ
టీ20 ప్రపంచ్ కప్ రెండోసారి సొంతం చేసుకున్న టీమిండియాకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత్ జట్టును చూస్తుంటే చాలా గర్విస్తున్నాం.. ఈ మ్యాచ్ ఒక చరిత్ర అని మోదీ ట్వీట్ చేశారు.

రోహిత్ శర్మ తెలుగువాడు కావడం గర్వకారణం : వైఎస్ జగన్
టీ-20 వరల్డ్‌ కప్‌ గెలుచుకున్న భారత క్రికెట్‌ జట్టుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. సమిష్టి కృష్టితో భారత జట్టు అద్భుతమైన విజయాలు సాధించిందన్నారు. కృషి, పట్టుదలతో మరో గొప్ప గెలుపు సొంతం చేసుకున్నారని ప్రశంసించారు. వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో భారత్ జట్టు ఓటమితో తీవ్ర నిరాశకు గురైన అభిమానులకు ఈ విజయం గొప్ప ఊరటినిస్తుందన్నారు.

భారతజట్టు కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మ తెలుగువాడు కావడం గర్వకారణమన్నారు. జట్టును విజయవంతంగా నడిపించడంలో రోహిత్‌ చక్కటి నాయకత్వాన్ని ప్రదర్శించాడని కొనియాడారు. రాబోయే రోజుల్లో భారత జట్టు మరిన్ని ఛాంపియన్‌షిప్‌లు సాధిస్తుందని ఆకాంక్షించారు.

విశ్వ విజేతలకు అభినందనలు : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
‘‘రెండో సారి టీ20 ప్రపంచకప్ గెలుచి విశ్వ విజేతగా నిలచిన రోహిత్ సేనకు అభినందనలు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నిలబెడుతూ రోహిత్ సేన సాధించిన విజయం చరిత్రలో నిలచిపోతుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ పోరులో జట్టు సమష్టిగా రాణించిన తీరు ఎంతో అద్భుతం.

ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఒత్తిడిని జయంచి సగర్వంగా ప్రపంచకప్ సాధించి పెట్టిన భారత క్రికెటర్లకు పేరు పేరునా హృదయ పూర్వక శుభాకాంక్షలు. మీ విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ క్రికెట్‌లో భారత్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని అభినందనలు తెలియజేశారు.

భారత్ క్రికెట్ జట్టుకు శుభాభినందనలు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 
ఉత్కంఠ పోరులో రోహిత్ సేన టీ20 వరల్డ్ కప్ గెలుచుకోవడం ప్రతి భారతీయునికి గర్వకారణమన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలిచి ప్రపంచ వేదికపై భారత్ ఖ్యాతిని మరింత పెంచారని కొనియాడారు. క్లిష్ట పరిస్థితుల్లో సమిష్టి కృషితో, అన్ని విభాగాల్లో టోర్నమెంట్ అధ్యంతం అద్భుతమైన ప్రదర్శనతో  ఆకట్టుకుని మరోసారి తన సత్తా చాటిందని కిషన్ రెడ్డి అన్నారు. టీం ఇండియా గెలుపు ప్రతి క్రికెట్ ప్రేమికుడికీ యావత్ భారతావనికి ఎంతో సంతోషాన్ని కలిగించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

భారత జట్టుకు హృదయపూర్వక అభినందనలు : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
భారత జట్టు అత్యంత క్లిష పరిస్థితుల్లో అత్యుత్తమ నైపుణ్యాలను ప్రదర్శించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. టీమిండియా అద్భుతమైన ప్రదర్శనను చూసి దేశమంతా గర్వపడుతున్నామంటూ అభినందనలు తెలియజేశారు.

టీమిండియా గెలిచిన తీరు అద్భుతం : మంత్రి నారా లోకేష్
రోహిత్ సేన 17ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని గెలిచి చరిత్ర సృష్టించింది. టీమిండియాను చూస్తుంటే దేశం గర్విస్తోందన్నారు.

టీమిండియాకు అభినందనలు : రాహుల్ గాంధీ
టీ20 ప్రపంచ కప్ సాధించిన భారత్ కు అభిందనలు తెలిపారు రాహుల్ గాంధీ, రోహిత్.. ఈ విజయం మీ నాయకత్వానికి నిదర్శనమన్నారు. బ్లూ టీమ్ అద్భుతమైన ఆటతో దేశం గర్వపడేలా చేశారని కొనియాడారు.

Read Also : SA vs IND T20 WC : విశ్వవిజేతగా భారత్.. 17ఏళ్ల నిరీక్షణ తర్వాత ట్రోఫీ సొంతం!

ట్రెండింగ్ వార్తలు