AP Pension Scheme : ఎల్లుండి పెనుమాకలో సీఎం చంద్రబాబు స్వయంగా రూ. 7 వేల పింఛన్ల పంపిణీ..!

AP Pension Scheme : రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు 65 లక్షల 18వేల 496 మంది లబ్ధిదారులకు రూ. 4,408 కోట్లు పంపిణీ చేయనుంది ప్రభుత్వం. ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.

AP Pension Scheme : ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని మంగళగిరి నియోజకవర్గం నుంచి సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. జూలై ఒకటో తేదీన పెనుమాకలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారు. ఆరోజు ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ మొదలు పెట్టనున్నారు.

అక్కడ జరిగే ప్రజా వేదిక కార్యక్రమంలో లబ్ధిదారులు ప్రజలతో చంద్రబాబు మాట్లాడనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు 65 లక్షల 18వేల 496 మంది లబ్ధిదారులకు రూ. 4,408 కోట్లు పంపిణీ చేయనుంది ప్రభుత్వం. మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

మరోవైపు పింఛన్ దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రధమ కర్తవ్యం అని తెలిపారు. ప్రజలకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైందని మేనిఫెస్టోలో చెప్పినట్టు పింఛన్లను ఒకేసారి వేయి రూపాయలు పెంచి నాలుగువేల రూపాయలు ఇస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు.

దివ్యాంగుల పింఛన్ మూడువేల నుంచి రూ. 6వేలకు పెంచి ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఏపీకి ఆర్థిక సమస్యలు ఉన్నా ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచి నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా రూ. 819 కోట్ల రూపాయలు భారం పడనుంది.

Read Also : AP CM Chandrababu : ఐదేళ్లు ఏపీ ప్రజలు ఇబ్బందులు పడ్డారు.. సమస్యలన్నీ వెంటనే పరిష్కరిస్తాం : సీఎం చంద్రబాబు

ట్రెండింగ్ వార్తలు