ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్.. బీఆర్ఎస్ బాస్ ఫొటో వైరల్

బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా కారు నడిపిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ముగ్గురిని కారులో ఎక్కించుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టీరింగ్ పట్టుకున్నట్టు ఫొటోలో కనిపించింది.

KCR Car Driving: బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్‌లో రిలాక్స్ అవుతున్నారు. లోక్‌స‌భ‌ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఆయన తన వ్యవసాయ క్షేత్రంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. అక్కడే పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుస్తున్నారు. ప్రతిరోజు కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితులు వచ్చి ఆయనను కలిసి ఫొటోలు దిగుతున్నారు. కేసీఆర్ కూడా కార్యకర్తలతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఆరా తీస్తున్నారు.

సమయం దొరకడంతో తన ఎంతో ఇష్టమైన వ్యవసాయానికి ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు. వ్యవసాయ పనులను దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన బీఆర్ఎస్ బాస్ కారు నడిపారు. కేసీఆర్ స్వయంగా కారు నడిపిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ముగ్గురిని కారులో ఎక్కించుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టీరింగ్ పట్టుకుని కారు నడుపుతున్నట్టుగా ఫొటోలో కనిపించింది. బీఆర్ఎస్ బాస్ కార్ డ్రైవింగ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఈ ఫోటో చూసి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అందుకే కాంగ్రెస్‌లో చేరారు: సీఎం రేవంత్

కాగా, కాలి గాయం నుంచి కేసీఆర్ పూర్తిగా కోలుకుకున్నట్టు కనబడుతోంది. కాలికి ఆపరేషన్ జరగడంతో మొన్నటి వరకు ఊతకర్ర సహాయంతో ఆయన నడిచేవారు. ఇప్పుడు ఆయనే స్వయంగా కారు నడపడంతో కాలి గాయం పూర్తిగా నయమయినట్టేనని కేసీఆర్ మద్దతుదారులు భావిస్తున్నారు. తమ అధినాయకుడు పూర్తిగా కోలుకుని మళ్లీ జనం మధ్యలోకి రావాలని వారు ఆకాంక్షిస్తున్నారు. కాగా, డాక్టర్ల సూచనల మేరకు కేసీఆర్ కారు నడిపినట్టు తెలుస్తోంది. కాలి గాయం నుంచి కోలుకుని కర్ర సహాయం లేకుండా నడుస్తున్న ఆయనను మ్యానువల్ కారు నడిపి చూడమని డాక్టర్లు సలహాయిచ్చారట. దీంతో తన పాత ఓమ్నీ వ్యాన్‌ను డ్రైవ్ చేశారని సన్నిహితులు వెల్లడించారు.

 

ట్రెండింగ్ వార్తలు