జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అందుకే కాంగ్రెస్‌లో చేరారు: సీఎం రేవంత్

పార్టీ ఫిరాయింపులకు ముందుగా కేసీఆర్ క్షమాపణ చెప్పాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్ర

జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అందుకే కాంగ్రెస్‌లో చేరారు: సీఎం రేవంత్

cm revanth reddy clarity on Jagtial mla join in congress party

CM Revanth Reddy : ఎన్నికలు ముగిసిపోయాయని, సంక్షేమ పథకాల అమలే లక్ష్యంగా పనిచేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కేంద్ర మంత్రులను కలుస్తున్నట్టు చెప్పారు. కేంద్ర బడ్జెట్ నుంచి తెలంగాణకు ఎక్కువ నిధులు తేవాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే తమ మంత్రులతో కలిసి ఢిల్లీకి వచ్చినట్టు వెల్లడించారు. తొందరలోనే ప్రధాని, అమిత్ షాను కలుస్తామన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తామని పునరుద్ఘాటించారు.

జగిత్యాల అభివృద్ధి కోసం అక్కడి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారని, జీవన్ రెడ్డి అనుభవాన్ని పార్టీ సమర్థవంతంగా వినియోగించుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన నేతలు, కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసాయిచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ముందుగా కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలనే భావదారిద్ర్యంతో కేసీఆర్ ఉన్నారని మండిపడ్డారు. కేసీఆర్ కు ఇప్పటికైనా కనువిప్పు కలగాలన్నారు.

Also Read : అధికార పార్టీలో ఉంటే ఆ కిక్కే వేరప్పా..! పవర్‌ కోసం సన్‌ఫ్లవర్స్ అవుతున్న లీడర్స్‌..!

కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించాలని కోరా
తన పదవీ కాలం పూర్తయ్యేలోపు కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించాలని అధిష్టానాన్ని కోరినట్టు సీఎం రేవంత్ వెల్లడించారు. సామాజిక న్యాయంతో పాటు సమర్థుడైన నాయకుడిని హైకమాండ్ ఎంపిక చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ”2021 జూన్ 27 నాడు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చారు. జులై 7న చార్జ్ తీసుకున్నాను. మూడేళ్ళతో నా పదవీకాలం ముగుస్తుంది. కొత్త పీసీసీని ఎంపిక చేయాలని అధిష్టానాన్ని కోరాను. త్వరలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంద”ని భావిస్తున్నామని చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.