స్మగ్లింగ్ కేసు.. తెలంగాణ మంత్రి కొడుకు నివాసంలో కస్టమ్స్ అధికారుల తనిఖీలు

హవాల రూపంలో వాచ్ కు హర్ష రెడ్డి డబ్బులు చెల్లించినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ముబిన్, హర్ష రెడ్డి కి మధ్యవర్తిగా నవీన్ కుమార్ అనే ఉన్నాడు.

Minister Ponguleti Srinivas Reddy Son Harsha Reddy : వాచీల స్మగ్లింగ్‌ కేసులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు హర్ష రెడ్డి నివాసంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. పొంగులేటి హర్ష రెడ్డి 1.7 కోట్లు విలువగల వాచీల స్మగ్లింగ్‌ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. పొంగులేటి నివాసంలో సుమారు ఆరు గంటల సేపు చెన్నైకి చెందిన కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.

Also Read : Kalki 2898 AD : నార్త్ అమెరికాలో ‘కల్కి’ జోరు.. ఆర్ఆర్ఆర్ రికార్డు బేజారు

పొంగులేటి హర్ష రెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు బ్రాండెడ్ వాచ్ ల స్మగ్లింగ్ కేసులో ఏప్రిల్ 4వ విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. అయితే, తాను డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నానని.. ఏప్రిల్ 27తర్వాత విచారణకు హాజరవుతానన్న కస్టమ్స్ అధికారుల నోటీసులకు పొంగులేటి హర్ష రిప్లయ్ ఇచ్చాడు. ముబిన్ అనే స్మగ్లర్ నుండి రెండు బ్రాండెడ్ వాచ్ లను చెన్నై కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకోగా.. పటెక్ ఫిలిప్, బ్రిగట్ వాచ్ లను హర్షా రెడ్డి కోసం సింగపూర్ నుండి ముబిన్ తీసుకొచ్చినట్లు గుర్తించారు. ఇండియాలో పటెక్ ఫిలిప్ వాచ్ లభించదు. ఒక్కో వాచ్ ఖరీదు రూ. 1.75 కోట్లు ఉంటుంది.

Also Read : కేసీఆర్ రిట్ పిటీషన్‌పై హైకోర్టులో విచారణ.. జ్యుడీషియరీ కమిషన్‌ ఎంక్వైరీ చేస్తే తప్పేంటని ప్రశ్నించిన కోర్టు

హవాల రూపంలో వాచ్ కు హర్ష రెడ్డి డబ్బులు చెల్లించినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ముబిన్, హర్ష రెడ్డి కి మధ్యవర్తిగా నవీన్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు. నవీన్ కుమార్ ను సైతం కస్టమ్స్ అధికారులు విచారించారు. స్మగ్లింగ్ వాచ్ ల కుంభకోణం 100కోట్లు పైబడి ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 5న ఈ కేసును కస్టమ్స్ అధికారులు నమోదు చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు