కేసీఆర్ రిట్ పిటీషన్‌పై హైకోర్టులో విచారణ.. జ్యుడీషియరీ కమిషన్‌ ఎంక్వైరీ చేస్తే తప్పేంటని ప్రశ్నించిన కోర్టు

కమిషన్ పై రేపటి వరకు స్టే ఇవ్వాలని హైకోర్టున కేసీఆర్ తరఫు న్యాయవాది కోరారు. అయితే, స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.

కేసీఆర్ రిట్ పిటీషన్‌పై హైకోర్టులో విచారణ.. జ్యుడీషియరీ కమిషన్‌ ఎంక్వైరీ చేస్తే తప్పేంటని ప్రశ్నించిన కోర్టు

High Court

KCR Petition Hearing In High Court : విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలు, ప్రాజెక్టుల నిర్మాణాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియరీ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటీషన్ పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. జ్యుడీషియరీ కమిషన్ ఎంక్వైరీ చేస్తే తప్పేంటని పిటిషనర్ ను హైకోర్టు ప్రశ్నించింది. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాక.. దానిపై చర్చించొచ్చు కదా అని హైకోర్టు పేర్కొంది.

Also Read : జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అందుకే కాంగ్రెస్‌లో చేరారు: సీఎం రేవంత్

పిటిషనర్ తరపు న్యాయవాది ఆధిత్య సొంది హైకోర్టులో తమ వాదనలు వినిపించారు. ఈఆర్సీ ఇచ్చిన తీర్పు ప్రకారమే ఛత్తీస్ గడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేశామని కోర్టుకు తెలిపారు. ఈఆర్సీ ఇచ్చిన తీర్పులపై జ్యుడీషియరీ కమిషన్ వేసి ఎంక్వైరీ చేయకూడదని తెలిసినా.. కమిషన్ వేశారని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ని ఈనెల 15 లోపు రిప్లయ్ ఇవ్వాలని జ్యుడీషియరీ కమిషన్ నోటీసులు పంపింది.. కేసీఆర్ నోటీసులకు రిప్లయ్ ఇచ్చేలోపే ఈనెల 11న జస్టిస్ నర్సింహరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి గత ప్రభుత్వం తప్పులు చేసినట్లు తెలిపారని, కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్నట్లుగా ప్రెస్ మీట్ లో జస్టిస్ నర్సింహారెడ్డి మాట్లాడారని పిటీషన్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. భద్రాద్రి ప్రాజెక్ట్ సబ్ క్రిటికల్ ప్రాజెక్ట్ కింద నిర్మాణం చేశామని తప్పుబడుతున్నారు.. కానీ దేశవ్యాప్తంగా చాలా ప్రాజెక్టులు సబ్ క్రిటికల్ మోడ్ లో నిర్మించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Also Read : ఏపీ సర్వీస్‌లోకి ఐపీఎస్ అధికారి మహేష్ చంద్రలడ్డా.. గతంలో ఏపీలో ఎక్కడెక్కడ పనిచేశారంటే..

జ్యుడీషియరీ కమిషన్ పూర్తిగా పొలిటికల్ ఎజెండాతో వేసిన కమిషన్ అని పిటీషన్ తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ తరపున వాదనలువిన్న హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. దీంతో ప్రభుత్వం తరఫు వాదనలను సుదర్శన్ రెడ్డి రేపు కోర్టు ఎదుట వినిపించనున్నారు.