ఏపీ సర్వీస్‌లోకి ఐపీఎస్ అధికారి మహేష్ చంద్రలడ్డా.. గతంలో ఏపీలో ఎక్కడెక్కడ పనిచేశారంటే..

ఐపీఎస్ అధికారి మహేష్ చంద్రలడ్డా ఏపీ సర్వీస్ లోకి రానున్నారు.. ప్రస్తుతం ఆయన కేంద్ర సర్వీస్ లో సీఆర్పీఎఫ్ ఐజీగా పనిచేస్తున్నారు.

ఏపీ సర్వీస్‌లోకి ఐపీఎస్ అధికారి మహేష్ చంద్రలడ్డా.. గతంలో ఏపీలో ఎక్కడెక్కడ పనిచేశారంటే..

IPS Mahesh Chandra Laddha

IPS Mahesh Chandra Ladda into AP Service : ఐపీఎస్ అధికారి మహేష్ చంద్రలడ్డా ఏపీ సర్వీస్ లోకి రానున్నారు.. ప్రస్తుతం ఆయన కేంద్ర సర్వీస్ లో సీఆర్పీఎఫ్ ఐజీగా పనిచేస్తున్నారు. ఏపీ కేడర్ కు చెందిన లడ్డాను మళ్లీ రాష్ట్ర సర్వీస్ లోకి పంపాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఐపీఎస్ లడ్డాను ఏపీ సర్వీస్ లోకి పంపుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు ఉత్తర్వులుసైతం జారీ చేసింది. లడ్డాను ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఏపీ ప్రభుత్వం నియమిస్తుందని ప్రచారం జరుగుతుంది.

Also Read : Nitish Reddy : తెలుగు ఆట‌గాడు నితీశ్ రెడ్డికి షాక్‌.. మొన్న ఎంపిక చేశారు.. నిన్న తీసేశారు..!

1998 బ్యాచ్ కు చెందిన మహేష్ చంద్రలడ్డాది రాజస్థాన్ రాష్ట్రం. ఆయన విశాఖలో ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించారు. ప్రకాశం, గుంటూరు, నిజామాబాద్ జిల్లాలకు ఎస్పీగానూ పనిచేశారు. ప్రకాశం జిల్లాలో పనిచేసిన సమయంలో మావోయిస్టుల అణచివేత, శాంతి భద్రతల పర్యవేక్షణలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ శాంతి భద్రతల పరిరక్షలో సఫలమయ్యాడు. ఆ జిల్లాలో ఎస్పీగా పనిచేస్తున్న క్రమంలో 2005 ఏప్రిల్ 27న మావోయిస్టులు మహేశ్ చంద్రలడ్డాపై దాడికి చేశారు. తృటిలో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆ తరువాత గుంటూరు జిల్లా ఎస్పీగా వెళ్లారు. గుంటూరులోనూ నక్సల్స్ వేరివేతతో పాటు.. రౌడీయిజంపై ఉక్కుపాదం మోపారు.

Also Read : Lal Krishna Advani : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ

విజయవాడ డిప్యూటీ కమిషనర్ గానూ పనిచేసిన అనుభవం మహేశ్ చంద్రలడ్డాకు ఉంది. విశాఖపట్టణం కమిషనర్ గానూ పనిచేశారు. 2019లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్ పోర్టులో కోడికత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో విశాఖపట్టణం సిటీ పోలీస్ కమిషనర్ గా మహేష్ చంద్రలడ్డా ఉన్నారు. ఆ తరువాత విశాఖ నుంచి నేరుగా సెంట్రల్ సర్వీసులకు వెళ్లారు. ప్రస్తుతం మళ్లీ ఏపీ సర్వీసులోకి తిరిగిరానున్నారు.