Nitish Reddy : తెలుగు ఆట‌గాడు నితీశ్ రెడ్డికి షాక్‌.. మొన్న ఎంపిక చేశారు.. నిన్న తీసేశారు..!

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత టీమ్ఇండియా జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది.

Nitish Reddy : తెలుగు ఆట‌గాడు నితీశ్ రెడ్డికి షాక్‌.. మొన్న ఎంపిక చేశారు.. నిన్న తీసేశారు..!

Shivam Dube replaces Nitish Reddy in India’s squad for Zimbabwe T20I series

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత టీమ్ఇండియా జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఈ ప‌ర్య‌న‌ట‌కు వెళ్లే భార‌త జ‌ట్టును ఇప్ప‌టికే భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్ర‌క‌టించింది. తెలుగు తేజం, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఆల్‌రౌండ‌ర్ నితీశ్ కుమార్ రెడ్డి కి బీసీసీఐ తొలుత జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌కు చోటు ఇచ్చింది. అయితే.. ఇప్పుడు అత‌డిని త‌ప్పిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అత‌డి స్థానంలో టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ శివ‌మ్ దూబెను ఎంపిక చేసిన‌ట్లుగా తెలిపింది.

కాగా.. నితీశ్ రెడ్డి గాయ‌ప‌డిన‌ట్లుగా బీసీసీఐ సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేసింది. ‘అజిత్ అగార్క‌ర్ నేతృత్వంలోని సెల‌క్ష‌న్ క‌మిటీ గాయ‌ప‌డిన నితీశ్ రెడ్డి స్థానాన్ని శివ‌మ్ దూబెతో భ‌ర్తీ చేసింది.’ అని బీసీసీఐ చెప్పింది. అయితే.. నితీశ్ రెడ్డి ఎలా గాయ‌ప‌డ్డాడు. ఎక్క‌డ గాయ‌మైంది అన్న విష‌యాల‌ను మాత్రం వెల్ల‌డించ‌లేదు. కానీ.. అత‌డి గాయాన్ని బీసీసీఐ మెడిక‌ల్ టీమ్ ప‌ర్య‌వేక్షిస్తోందని మాత్రం తెలియ‌జేసింది. జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌కు ఎంపికైన ఆట‌గాళ్ల‌కు ఎన్‌సీఏలో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే నితీశ్ కుమార్ రెడ్డి గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

0,2,9,10,0,2,8,8,0,2,2.. ఇది అఫ్గానిస్థాన్ ఫోన్ నంబ‌ర్ భ‌య్యా.. !


జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో భార‌త జ‌ట్టు 5 మ్యాచుల టీ20 సిరీస్ ఆడ‌నుంది. జూలై 6 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి, సూర్య‌కుమార్ యాద‌వ్ వంటి సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌కు ఈ సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చారు. శుభ్‌మ‌న్ గిల్ నాయ‌క‌త్వంలో భార‌త్ ఆడ‌నుంది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో జ‌ట్టులో చోటు ద‌క్క‌ని రింకూసింగ్‌, య‌శ‌స్వి జైస్వాల్‌, సంజూ శాంస‌న్ వంటి ఆట‌గాళ్ల‌తో పాటు ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించిన యువ ఆట‌గాళ్లు అభిషేక్ శ‌ర్మ‌, రియాన్ ప‌రాగ్‌, తుషార్ దేశ్ పాండేల‌కు చోటు క‌ల్పించారు.

జింబాబ్వే పర్యటనకు భార‌త జ‌ట్టు ఇదే..
భ్‌మ‌న్ గిల్‌ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీప‌ర్‌), ధ్రువ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్ ముఖేష్ కుమార్, తుషార్ దేశ్ పాండే.

టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..
తొలి టీ20 – జూలై 6న‌
రెండ‌వ టీ20 – జూలై 7న‌
మూడ‌వ టీ20 – జూలై 10న‌
నాలుగో టీ20 – జూలై 13న‌
ఐదో టీ20 – జూలై 14
మ్యాచులు అన్నీ కూడా హ‌రారే వేదిక‌గానే జ‌ర‌గ‌నున్నాయి.

SA vs AFG : చ‌రిత్ర సృష్టించిన ద‌క్షిణాఫ్రికా.. మొద‌టి సారి ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌కి..