0,2,9,10,0,2,8,8,0,2,2.. ఇది అఫ్గానిస్థాన్ ఫోన్ నంబ‌ర్ భ‌య్యా.. !

వెస్టిండీస్‌, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో అఫ్గానిస్థాన్ జ‌ట్టు అంచ‌నాల‌ను మించి రాణించింది.

0,2,9,10,0,2,8,8,0,2,2.. ఇది అఫ్గానిస్థాన్ ఫోన్ నంబ‌ర్ భ‌య్యా.. !

Afghanistan

South Africa vs Afghanistan : వెస్టిండీస్‌, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో అఫ్గానిస్థాన్ జ‌ట్టు అంచ‌నాల‌ను మించి రాణించింది. గ్రూపు ద‌శ‌లో న్యూజిలాండ్‌ను సూప‌ర్ 8 ద‌శ‌లో ఆస్ట్రేలియాను ఓడించి సెమీ ఫైన‌ల్‌కు చేరుకుంది. సెమీఫైన‌ల్‌లో ప‌టిష్ట ద‌క్షిణాఫ్రికాతో త‌డ‌బ‌డింది. స‌ఫారీల అనుభ‌వం ముందు అఫ్గాన్ చిన్న జ‌ట్టే అయినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఫార్మాట్‌లోనైనా ఒక్క‌సారి కూడా సెమీ ఫైన‌ల్ అడ్డంకిని ద‌క్షిణాఫ్రికా దాట‌క‌పోవ‌డంతో అఫ్గాన్ ఏమైనా సంచ‌ల‌నం సృష్టిస్తుందేమోన‌ని చాలా మంది భావించారు.

మ్యాచ్ హోరాహోరీగా జ‌రుగుతుంద‌ని భావించారు. అయితే.. అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌క్రిందులు చేస్తూ క‌నీసం పోరాడ‌కుండానే అఫ్గానిస్థాన్ చేతులెత్తేసింది. ప‌సికూన జ‌ట్ల మాదిరి అఫ్గాన్ బ్యాట‌ర్లు పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. ద‌క్షిణాఫ్రికా బౌలింగ్‌కి అఫ్గాన్ బ్యాట‌ర్ల వ‌ద్ద స‌మాధాన‌మే లేక‌పోయింది. 11.5 ఓవ‌ర్ల‌లో 56 ప‌రుగుల‌కు ఆలౌలైంది. ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో సెమీ ఫైన‌ల్‌లో ఓ జ‌ట్టు చేసిన అత్య‌ల్ప స్కోరు ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ముగ్గ‌రు బ్యాట‌ర్లు డ‌కౌట్ కాగా.. అజ్మ‌తుల్లా (10) ఒక్క‌డే రెండు అంకెల స్కోరు చేశాడు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అయ్యాడు.

Also Read: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్‌కు రోహిత్ శర్మ స్ట్రాంగ్ కౌంటర్ ..

0,2,9,10,0,2,8,8, 0,2,2.. ఇదీ అఫ్గాన్ బ్యాటింగ్ స్కోరు కార్డు. ప్ర‌స్తుతం అఫ్గాన్ స్కోరు కార్డు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. చూస్తుంటే ఇది అఫ్గాన్‌ ఫోన్ నంబ‌ర్‌గా అనిపిస్తుందంటూ నెటిజ‌న్లు ఫ‌న్నీగా కామెంట్లు పెడుతున్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ద‌క్షిణాఫ్రికా 8.5 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోయి ఛేదించింది. రీజాహెడ్రిక్స్ (29 నాటౌట్‌), మార్‌క్ర‌మ్ (23 నాటౌట్‌) లు రాణించారు. ఈ విజ‌యంతో స‌ఫారీలు ఫైన‌ల్‌లో అడుగుపెట్టారు. కాగా.. ఏ ఫార్మాట్‌లోనైనా ద‌క్షిణాప్రికా జ‌ట్టు ఫైన‌ల్‌కు చేరుకోవ‌డం ఇదే తొలిసారి.

Team India Video: సెమీఫైనల్‌కు సిద్ధమవుతున్న టీమిండియా.. గయానాలో రోహిత్ సేన