పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్‌కు రోహిత్ శర్మ స్ట్రాంగ్ కౌంటర్ ..

భారత్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డాడంటూ పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ చేసిన వ్యాఖ్యలపై భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు.

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్‌కు రోహిత్ శర్మ స్ట్రాంగ్ కౌంటర్ ..

Rohit Sharma

Rohit Sharma : టీ20 వరల్డ్ కప్ -2024 టోర్నీలో భాగంగా సూపర్-8లో ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 24 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో భారత్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే, అర్ష్‌దీప్ సింగ్ బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడినట్లు పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ఆరోపించాడు. ఓ టీవీ ఛానెల్ డిబేట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.

Also Read : Team India Video: సెమీఫైనల్‌కు సిద్ధమవుతున్న టీమిండియా.. గయానాలో రోహిత్ సేన

అర్ష్‌దీప్ సింగ్ కొత్త బంతి నుంచి రివర్స్ స్వింగ్ వచ్చేలా మిడిల్ ఓవర్లలో బంతిని టాంపరింగ్ చేశాడని ఇంజమామ్ ఆరోపించాడు. అర్ష్‌దీప్ సింగ్ 15వ ఓవర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు రివర్స్ స్వింగ్ వచ్చింది. కొత్త బంతితో తొందరగా రివర్ష్ స్వింగ్ రాదు.. అంటే 12 లేదా 13వ ఓవర్లో రివర్స్ స్వింగ్ కోసం బంతిని ట్యాంపరింగ్ చేశాడని అర్థమవుతుంది. అంపైర్లు కూడా ఆ విషయాన్ని గమనించక పోవటం విడ్డూరంగా ఉదంటూ ఇంజమామ్ ఉల్ హక్ అన్నారు.

Also Read : IND vs PAK: జూలై 19న భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ .. ఎక్కడంటే?

పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ వ్యాఖ్యలపై భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. గురువారం రాత్రి గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో టీ20 ప్రపంచ కప్ 2024 సమీఫైనల్ కు ముందు రోహిత్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో అర్ష్‌దీప్ సింగ్‌పై ఇంజమామ్ చేసిన రివర్స్ స్వింగ్ ఆరోపణలపై మీడియా ప్రశ్నించగా.. స్పందించిన రోహిత్ మాట్లాడుతూ.. మేము ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాల్లో ఆడటం లేదు.. కరీబియన్ ఆడుతున్నాం. ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది.. దీంతో ఇక్కడి పిచ్ లు పొడిబారి ఉంటాయి. బాల్ రివర్స్ స్వింగ్ కు గురికావటం సర్వసాధారణం. జట్టు ఏ పరిస్థితుల్లో.. ఎలాంటి పిచ్ లలో ఆడుతున్నాయో ఇంజమామ్ ఉల్ హక్ అర్థం చేసుకోవాలంటూ రోహిత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.