IND vs PAK: జూలై 19న భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ .. ఎక్కడంటే?

జూలై 19న యూఏఈ వర్సెస్ నేపాల్ జట్ల మధ్య తొలి జరుగుతుంది. అదేరోజు భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

IND vs PAK: జూలై 19న భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ .. ఎక్కడంటే?

India vs Pakistan Match

Updated On : June 26, 2024 / 7:34 AM IST

Womens Asia Cup 2024 : జూలై 19 నుంచి మహిళల ఆసియా కప్ 2024 టోర్నీ ప్రారంభమవుతుంది. ఈ టోర్నీకి శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఆసియా కప్ షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. జూలై 19 నుంచి జూలై 28 వరకు ఈ టోర్నీ కొనసాగుతుంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటాయి. నాలుగు జట్లు చొప్పున రెండు గ్రూపులుగా విభజించి ఈ టోర్నీ జరుగుతుంది. జూలై 19న యూఏఈ వర్సెస్ నేపాల్ జట్ల మధ్య తొలి జరుగుతుంది. అదేరోజు భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

Also Read : రోహిత్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. రికార్డులే రికార్డులు.. ఇవిగో వివరాలు

గ్రూప్ -ఏలో భారత్, పాకిస్థాన్, నేపాల్, యూఏఈ జట్లు తలపడనుండగా.. గ్రూప్ -బిలో మలేషియా, థాయిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. మహిళల ఆసియా కప్ లో ఇప్పటి వరకు 12సార్లు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. అందులో టీమిండియా 11సార్లు విజేతగా నిలిచింది. 2022 ఆసియా కప్ లో పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది. భారత్, పాకిస్థాన్ జట్లు 2012, 2016 సంవత్సరాల్లో జరిగిన మహిళా ఆసియా కప్ ఫైనల్స్ లో తలపడ్డాయి. రెండు సార్లు కూడా భారత్ మహిళా జట్టు విజయం సాధించింది.

Also Read : ఉత్కంఠభరిత పోరులో బంగ్లాపై అఫ్గానిస్థాన్ విజయం.. టోర్నీ నుంచి ఆస్ట్రేలియా ఔట్

మహిళల ఆసియా కప్ 2004లో ప్రారంభమైంది. మొత్తం ఎనిమిది సార్లు ఈ టోర్నీలో భారత్ మహిళా జట్టు ఆడింది. అన్ని టోర్నీల్లోనూ భారత్ జట్టు ఫైనల్స్ కు చేరింది. అయితే, ఏడు సార్లు టైటిల్ ను కైవసం చేసుకున్న భారత్.. 2018లో బంగ్లాదేశ్ తో జరిగిన ఫైనల్ లో భారత్ మహిళా జట్టు ఓడిపోయింది. జూలై 19 నుంచి జరిగే మహిళల ఆసియా కప్ -2024 టోర్నీలోనూ విజేతగా నిలిచేందుకు భారత్ మహిళా జట్టు సన్నద్ధమవుతుంది.

గ్రూప్ దశలో భారత్ మ్యాచ్ ల షెడ్యూల్..
జూలై 19న : భారత్ వర్సెస్ పాకిస్థాన్
జూలై 21న : భారత్ వర్సెస్ యూఏఈ
జూలై 23న : భారత్ వర్సెస్ నేపాల్