రోహిత్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. రికార్డులే రికార్డులు.. ఇవిగో వివరాలు

రోహిత్ శర్మ మామూలుగా ఆడితేనే ఓ రేంజ్‌లో ఉంటుంది అతడి ఆట. ఇక రెచ్చిపోయి ఆడితే రోహిత్ శర్మ దెబ్బకు రికార్డు బద్దలు కావాల్సిందే.

రోహిత్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. రికార్డులే రికార్డులు.. ఇవిగో వివరాలు

Rohit Sharma T20I Records (Photo: @ICC)

Rohit Sharma T20I Records: రోహిత్ శర్మ మామూలుగా ఆడితేనే ఓ రేంజ్‌లో ఉంటుంది అతడి ఆట. ఇక రెచ్చిపోయి ఆడితే రోహిత్ శర్మ దెబ్బకు రికార్డు బద్దలు కావాల్సిందే. టీ20 క్రికెట్ ప్రపంచకప్‌ కీలక పోరులో హిట్‌మాన్‌ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియా బౌలర్లను చితక్కొట్టి జట్టును విజయాన్ని అందించాడు. ఆసీస్ బౌలర్లు ఎవరినీ వదలకుండా ఫోర్లు, సిక్సర్లతో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో పలు రికార్డులు హిట్‌మాన్‌ ఖాతాలో చేరిపోయాయి.

బాబర్ ఆజం రికార్డ్ బ్రేక్
టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ 2024లో ఫాస్టెస్ట్ ఫిప్టి కొట్టిన మొనగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సర్లతో హాఫ్ సెంచరీ బాదేశాడు. దీంతో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆస్ట్రేలియాపై తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా ఖ్యాతికెక్కాడు. సెంచరీకి 8 పరుగుల దూరంలో అతడు అవుటయ్యాడు. 41 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 92 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. కాగా, ఇంటర్నేషనల్ టీ20ల్లో అత్యధిక రన్స్(4165) సాధించిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం(4145) పేరిట ఉండేది.

సిక్సర పిడుగు వరల్డ్ రికార్డు
రోహిత్ శర్మ ఇప్పటివరకు మొత్తం మూడు ఫార్మాట్లతో కలిపి ఆస్ట్రేలియాపై 132 సిక్సర్లు బాదాడు. దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఒకే జట్టుపై అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. దీంతో పాటు ఇంటర్నేషనల్ టీ20ల్లో 200 సిక్సర్లు పూర్తిచేసిన ఫస్ట్ బ్యాటర్‌గా వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. డాషింగ్ ఓపెనర్‌గా ఫాపులర్ అయిన రోహిత్ శర్మ తన పేరును నిలబెట్టుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక సిక్సర్లు(529) బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 19 వేల రన్స్ కంప్లీట్ చేసిన 4వ ఇండియన్ బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు.

Also Read : రోహిత్ శర్మ 6, 6, 4, 6, 0, 6.. రితిక రియాక్షన్ చూశారా?

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో రోహిత్ శర్మ సాధించిన మరికొన్ని రికార్డులు
అత్యధిక వ్యక్తిగత స్కోరు(92) చేసిన టీమిండియా కెప్టెన్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న ఫస్ట్ టీమిండియా కెప్టెన్
ఒక మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు(8) కొట్టిన ఇండియన్ బ్యాటర్
ఆస్ట్రేలియాపై ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు(8) బాదిన బ్యాటర్
పవర్ ప్లే ముగిసేలోపు హాఫ్ సెంచరీ సాధించిన 4వ బ్యాటర్

Also Read : రోహిత్, కోహ్లిల‌కు గంభీర్ చెక్‌..! బీసీసీఐ ముందు కీల‌క డిమాండ్లు.. ఒకే చెప్పిన బోర్డు..!