Lal Krishna Advani : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ

ఎల్ కే అద్వానీ ఆరోగ్యంపై ఎలాంటి అప్‌డేట్ ఆస్పత్రి నుంచి విడుదల కాలేదు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆస్పత్రి వర్గాల సమాచారం.

Lal Krishna Advani : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ

lal krishna advani

Lal Krishna Advani Admitted To AIIMS : మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ అనారోగ్య సమస్యతో బుధవారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. 96ఏళ్ల అద్వానీ వయో సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. యూరాలజీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Also Read : అమరావతిలో ఫిల్మ్‌సిటీ.. తెలుగు నిర్మాతల సరికొత్త ప్లాన్‌

ఎల్ కే అద్వానీ ఆరోగ్యంపై ఎలాంటి అప్‌డేట్ ఆస్పత్రి నుంచి విడుదల కాలేదు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆస్పత్రి వర్గాల సమాచారం. అద్వానీకి ఈ ఏడాది ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రధానం చేసింది. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఎల్ కే అద్వానీని ఆయన నివాసానికి వెళ్లి భారతరత్నతో సత్కరించిన విషయం తెలిసిందే.

Also Read : SA vs AFG : చ‌రిత్ర సృష్టించిన ద‌క్షిణాఫ్రికా.. సెమీస్‌లో అఫ్గానిస్తాన్ పై ఘ‌న విజ‌యం.. ఫైన‌ల్‌కు..

అద్వానీ 1927న నవంబర్ 8 కరాచీ (ప్రస్తుత పాకిస్థాన్)లో జన్మించారు.
1942లో స్వయంసేవక్‌గా ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు.
1986 నుంచి 1990 ,1993 నుంచి 1998, 2004 నుంచి 2005 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు.
అత్యధిక కాలం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు.
దాదాపు మూడు దశాబ్దాల పాటు ఎంపీగా కొనసాగారు.
అటల్ బిహారీ వాజ్‌పేయి (1999-2004) క్యాబినెట్ లో ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు.
2009 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఉన్నారు.