Mithuna Rasi Phalalu 2026 : మిథున రాశి వారికి అఖండ రాజయోగం.. ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే ఇక మీకు తిరుగే లేదు..!
Mithuna Rasi Phalalu 2026 : పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది అంటున్నారు పండితులు.
Parabhava nama samvatsara ugadi panchangam 2026 mithuna rasi phalalu gemini horoscope
Mithuna Rasi Phalalu 2026 : పరాభవ నామ సంవత్సరంలో అదృష్టం వరించే రాశుల్లో మిథున రాశి వారు ముందు వరుసలో ఉంటారంటున్నారు పండితులు. ఈ సంవత్సరం వారికి ఆదాయం ఎక్కువ, ఖర్చులు తక్కువగా ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుందంటున్నారు. అలానే రాజపూజ్యం కూడా అధికంగా ఉందని.. ప్రశంసలు పొందుతారని.. చేసే పనికి గుర్తింపు, గౌరవం మరియు ప్రమోషన్లు లభిస్తాయి. కుటుంబ సభ్యుల వల్ల చిన్నపాటి అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉన్నా, సమాజంలో మాత్రం గౌరవం ఉంటుంది. ఈ సంవత్సరమంతా గురు గ్రహం అందరికీ అదృష్టాన్ని పంచుతూ, దురదృష్టం రాకుండా కాపాడబోతున్నాడని తెలిపారు.
ఆదాయం: 14 వ్యయం: 8 రాజపూజ్యం: 6 అవమానం: 1
జూన్ వరకు జాగ్రత్తగా ఉండాలి: మిథున రాశి వారికి జూన్ వరకు గురువు జన్మ రాశిలో ఉండటం వల్ల అహంకారం, గర్వం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మాటను అదుపులో ఉంచుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి. వైరాగ్య చింతన అలవరుచుకోవడం మంచిది.
జూన్-అక్టోబర్ 31 వరకు అద్భుత సమయం: కర్కాటకంలో గురువు ప్రవేశించినప్పుడు పట్టిందల్లా బంగారం అవుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారాలు ప్రారంభించడానికి అక్షయ తృతీయ లేదా వరలక్ష్మీ వ్రతం ఉత్తమ సమయం. అక్టోబర్ 31 తర్వాత ధనస్థానంలో గురువు ఉండటం వల్ల సంతోషకరమైన లాభాలు కలుగుతాయి.
అక్టోబర్ 31 నుండి జనవరి వరకు: గురువు మూడో స్థానానికి వెళ్లడం వల్ల సోదరులతో కలహాలు లేదా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీని నివారణకు అయ్యప్ప స్వామి లేదా ఆంజనేయ స్వామి దీక్ష స్వీకరించడం శ్రేయస్కరం. ఏదో ఒక ఆధ్యాత్మిక దీక్షలో ఉండటం వల్ల నష్టాల నుండి బయటపడవచ్చు.
అఖండ రాజయోగం: మిథున రాశి వారికి 2027 ఫిబ్రవరి నుండి జూలై వరకు మిథున రాశి వారికి అఖండ రాజయోగ సిద్ధి కలుగుతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి ప్రజాదరణ పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం.
ఇంటి మీద లోన్ తీసుకోవాలన్నా.. తీర్చాలన్నా.. ఈ సంవత్సరం మిథున రాశి వారికి చాలా అనుకూలం అంటున్నారు. తక్కువ జీతంతో బాధపడేవారు జూన్ తర్వాత ఉద్యోగం మారి వ్యాపారంలోకి వెళ్లడం మంచిది.
ముఖ్యమైన పరిహారాలు:
- కృష్ణ స్పటిక మాల మెడలో వేసుకోవడం వల్ల శని, రాహు దోషాలు తొలగిపోతాయి.
- ఆలయ దర్శనం: జూన్ లోపు ఉజ్జైని మహాకాళేశ్వరుడిని , హరసిద్ధి మాతను దర్శించుకోవాలి.
- అక్షయ తృతీయ: శ్రీ చక్రపీఠంలో జరిగే మహాలక్ష్మి యాగానికి హాజరై అమ్మవారి యంత్రాన్ని తీసుకోవడం వల్ల అదృష్టం వరిస్తుందంటున్నారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. దీన్ని 10tv.in నిర్ధారించడం లేదు.
