Anushka Shetty: ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కనున్న అనుష్క.. వరుడు ఎవరంటే? వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్
పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి(Anushka Shetty).
anushka shetty marriage news viral on social media
- పెళ్లి చేసుకుంటున్న అనుష్క
- బెంగళూరు బిజినెస్ మ్యాన్ తో ఏడడుగులు
- పెద్దలు కుదురిచ్చిన పెళ్ళని సమాచారం
Anushka Shetty: సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ‘లేడీ సూపర్ స్టార్’గా పేరుతెచ్చుకున్న అనుష్క శెట్టి పెళ్లి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. గత కొన్నేళ్లుగా ఆమె పెళ్లి గురించి అనేక రకాల ఊహాగానాలు వచ్చినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఆమె త్వరలోనే ఒక వ్యాపారవేత్తతో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 44 ఏళ్ల వయసున్న అనుష్క(Anushka Shetty), తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకోబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
Nabha Natesh: నాజూకు వయ్యారంతో నాభా నటేష్.. చీరలో అందం అదుర్స్.. ఫొటోలు
చాలా కాలంగా అనుష్క, ప్రభాస్ పెళ్లి వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. కానీ, తాము కేవలం మంచి స్నేహితులం మాత్రమేనని వారిద్దరూ పలుమార్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజా వార్తలు ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అనుష్క వివాహం చేసుకోబోయే వ్యక్తి కన్నడ కుటుంబానికి చెందినవారని, వీరిద్దరి వివాహ నిశ్చయానికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించినట్లు సమాచారం. ఇది ఒక పక్కా అరేంజ్డ్ మ్యారేజ్ అని, ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ పెళ్లిపై ఇరుకుటుంబాల నుంచి అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో ఆమె వైవాహిక జీవితాన్ని ప్రారంభించే అవకాశం ఉందని సన్నిహిత వర్గాల టాక్. అనుష్క వ్యక్తిగత జీవితాన్ని చాలా రహస్యంగా ఉంచడానికి ఇష్టపడతారు కాబట్టి, పెళ్లి ప్రకటన కూడా నేరుగా ఆహ్వాన పత్రికతోనే వచ్చే అవకాశం ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే, అనుష్క ప్రస్తుతం వైవిధ్యమైన సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె మలయాళంలో ‘కథనార్’ అనే భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నారు.
