Kalki 2898 AD : నార్త్ అమెరికాలో ‘కల్కి’ జోరు.. ఆర్ఆర్ఆర్ రికార్డు బేజారు
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కల్కి 2898 AD

Prabhas Kalki 2898 AD movie crossed RRR record in USA Premiere Collections
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘కల్కి 2898 AD’. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమా నేడు (జూన్ 27న గురువారం) ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో జోరును చూపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఆర్ఆర్ఆర్ రికార్డును బ్రేక్ చేసింది.
యూఎస్ సహా విదేశాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. భారత్‌లోనూ ఇప్పటికే షోలు పూర్తి అయ్యాయి. ఈ మూవీకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కలెక్షన్ల కూడా భారీగా వస్తున్నాయి. ఈ క్రమంలో నార్త్ అమెరికాలో ఓ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఆర్ఆర్ఆర్ పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. ఇక్కడ ప్రీమియర్స్ పరంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ప్రీమియర్ షోలతో, ఇప్పటి వరకు ఏకంగా 3.72 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ క్రమంలో నార్త్ అమెరికాలో అత్యధిక ఓపెనింగ్ అందుకున్న భారతీయ చిత్రంగా నిలిచింది. గతంలో ఆర్ఆర్ఆర్ ప్రీమియర్స్, తొలి రోజు కలిపి 3.42 మిలియన్లు వసూలు చేసింది.
Nara Lokesh : కల్కి హిట్ అయినందుకు సంతోషంగా ఉంది.. నారా లోకేష్ స్పెషల్ ట్వీట్..
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, శోభన, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అన్నా బెన్, మాళవిక నాయర్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్ లు కీలక పాత్రలు పోషించారు.
Em ledhu bro… Rebel Star addochina records anni narukkuntu pothunnadu ???
‘ ??? ???? ????? ?????? ‘#Prabhas #Kalki2898AD #BlockBusterKALKI @VyjayanthiFilms @Kalki2898AD pic.twitter.com/8mj8raQSNc
— Prathyangira Cinemas (@PrathyangiraUS) June 27, 2024