Eatala Rajender : రేపు ఈటల రాజేందర్ దంపతుల ప్రెస్‌మీట్.. ఏం ప్రకటన చేస్తారోనని తీవ్ర ఉత్కంఠ

Eatala Rajender : బీజేపీలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు రాజకీయంగా ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మరో హాట్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.

Eatala Rajender

Eatala Rajender – BJP : తెలంగాణ బీజేపీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. బీజేపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యవహార శైలి హాట్ టాపిక్ గా మారింది. ఈటల బీజేపీని వీడతారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. కొంతకాలంగా ఈటల రాజేందర్ మౌనంగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. కొన్ని రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ ఆఫీసుకి కూడా రాకపోవడం కేడర్ లో చర్చనీయాంశంగా మారింది.

ఈటలకు బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇస్తారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈటలకు వ్యతిరేకంగా పలువురు సీనియర్లు సమావేశమై చర్చించారని తెలుస్తోంది. అప్పటి నుంచి మీడియాకు దూరంగా ఉంటూ ఈటల మౌనం వహించడం ఆసక్తికరంగా మారింది.(Eatala Rajender)

ఈటల మౌనం.. దేనికి సంకేతం?
బీఆర్ఎస్‌కు బీజేపీ బీ టీమ్ అంటూ కాంగ్రెస్ పదే పదే చేస్తున్న ఆరోపణలపైనా ఈటల మౌనంగానే ఉన్నారు. మరోవైపు ఈటలతోపాటు మరో నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా సైలెంట్ గా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఈటల మౌనం వెనుక ఉద్దేశం ఏమిటనేది అటు పార్టీలో ఇటు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.(Eatala Rajender)

Also Read..BRS Expansion: స‌ర్వే సంస్థల నివేదిక‌ల ఆధారంగా.. జాతీయస్థాయిలో కేసీఆర్ పకడ్బందీ స్కెచ్‌!

ఈ పరిస్థితుల్లో మరో హాట్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. రేపు ఈటల రాజేందర్ దంపతులు ప్రెస్ మీట్ పెట్టనున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ కలిసి ఏం ప్రకటన చేయబోతున్నారు? ఏ అంశంపై మాట్లాడబోతున్నారు? అనే దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. బీజేపీ హైకమాండ్ తో భేటీ అనంతరం హైదరాబాద్ వచ్చిన వెంటనే ఈటల రాజేందర్ ఈ సమావేశం పెట్టాలని నిర్ణయించడంతో ఆయన ఎలాంటి బాంబు పేలుస్తారో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. బీజేపీలో ప్రస్తుతం నెలకొన్న ఈ పరిణామాలు రాజకీయంగా ఉత్కంఠ రేపుతున్నాయి. ఈటల రాజేందర్, ఆయన భార్య జమున వేర్వేరుగా ప్రెస్ మీట్ లు పెట్టబోతున్నారు. ఆ ప్రెస్ మీట్ లో ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారో అనేది ఉత్కంఠ రేపుతోంది.

తలనొప్పిగా మారిన అంతర్గత కుమ్ములాటలు..
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న బీజేపీ హైకమాండ్ కి.. అంతర్గత కుమ్ములాటలు తలనొప్పిగా మారాయి. పరిస్థితులను చక్కదిద్దేందుకు బీజేపీ పెద్దలు రంగంలోకి దిగారు. తెలంగాణ బీజేపీలో కీలక నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అధిష్ఠానం ఢిల్లీకి పిలిచింది.

Also Read..Etala Rajender : బీజేపీలో ఈటల మౌనం, అనుచరులతో సమావేశం.. పార్టీ మారతారంటూ ప్రచారం

ఇలా అయితే కష్టమే అంటున్న ఈటల, రాజగోపాల్ రెడ్డి..
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో వారు భేటీ అయ్యారు. సుదీర్ఘ సమావేశం జరిగింది. రాష్ట్రంలో పరిస్థితులను కేంద్రానికి వివరించిన ఈటల, రాజగోపాల్ రెడ్డి.. ప్రస్తుత వ్యూహాలతో బీఆర్ఎస్ ను ఎదుర్కోవడం కష్టమని తేల్చినట్లు తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీ మెత్తబడినట్లు ప్రజలు భావిస్తున్నారని, దీంతో స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారట. బీజేపీ అధిష్ఠానానికి తాము చెప్పాల్సిందంతా చెప్పామని ఈటల, కోమటిరెడ్డి మీడియాతో అన్నారు. (Eatala Rajender)

అధిష్టానం నుంచి అందని హామీ..!
బీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా బీజేపీలో చేరిన ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. పార్టీ వ్యవహారాల్లో కీలకంగా ఉన్నారు. అయితే, ఇటీవల కాలంలో వీరి జోరు తగ్గింది. పార్టీలో ఈటల, బండి వర్గాలుగా నేతలు విడిపోయారని ప్రచారం నడుస్తోంది. బీఆర్ఎస్‌ పట్ల బీజేపీ హైకమాండ్ మెతక వైఖరి అవలంభిస్తోందన్నది ఈటల వర్గం నేతల ప్రధాన ఆరోపణ. పటిష్ఠంగా ఉన్న బీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే బీజేపీ అధిష్ఠానం మరింత దూకుడుగా వ్యవహరించాలని, లేదంటే బీజేపీ తీవ్రంగా నష్టపోతుందని ఈటల వర్గం భావిస్తోంది. ఇదే విషయాన్ని ఈటల, కోమటిరెడ్డి అధిష్ఠానానికి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే.. అమిత్ షా నుంచి ఈటల, కోమటిరెడ్డికి స్పష్టమైన హామీ రాలేదని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు