Telangana Formation Day : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. కేంద్రం కీలక నిర్ణయం

Telangana Formation Day : బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని కేకే నే చెప్పారని గుర్తు చేశారు. పార్లమెంటులో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన ఏకైక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు.

Telangana Formation Day – Kishan Reddy : కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా గోల్కొండ కోటలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపనున్నారు. జూన్ 2, 3 తేదీల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ఉంటాయి. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన చేశారు.

3న సాంస్కృతిక కార్యక్రమాలు..
”2వ తేదీ ఉదయం 7 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణతో రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. 3వ తేదీ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. స్కూల్ విద్యార్థులకు ఫోటో పెయింటింగ్ పోటీలు జరుగుతున్నాయి. విద్యార్థులు అందరూ పాల్గొనవచ్చు. 2వ తేదీ సాయంత్రం నృత్యాలు, శంకర్ మహదేవన్, మంజులా రామస్వామి ఇన్ స్టిట్యూట్ విద్యార్థుల నృత్య ప్రదర్శన, మంగ్లీ, మధుప్రియ పాటల కార్యక్రమం ఉంటుంది.

ఇకపై అన్ని రాజ్ భవన్ లలో వేడుకలు..
పలు రాష్ట్రాల రాజ్ భవన్ లలో కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతాయి. రానున్న రోజుల్లో ఏ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలైనా అన్ని రాజ్ భవన్ లలో వేడుకలు జరుగుతాయి. ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్ నినాదంతో అన్ని రాష్ట్రాల రాజధానుల్లో తెలంగాణ ఉత్సవాలు జరుగుతాయి. ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ రాజ్ భవన్ లో ఉత్సవాలు జరుగుతాయి” అని కిషన్ రెడ్డి వెల్లడించారు.

Also Read..Telangana Formation Day 2023: జూన్ 2న తెలంగాణలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ ర్యాలీలు.. ఇంకా

బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రజల ఆకాంక్ష అన్న మంత్రి కిషన్ రెడ్డి.. తెలంగాణ కోసం తాను కూడా ఉద్యమంలో పాల్గొన్నానని గుర్తు చేశారు. లక్షలాది ప్రజలు తెలంగాణ కోసం ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారు కాబట్టే తెలంగాణ కల సాకారం అయ్యిందన్నారు. పార్లమెంటులో సుస్మాస్వరాజ్ నేతృత్వంలో 160 మంది బీజేపీ ఎంపీలు తెలంగాణ రావడంలో కీలకపాత్ర పోషించారని ఆయన చెప్పారు. బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని కేకే నే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు.

చిన్న రాష్ట్రాలకు బీజేపీ అనుకూలం..
బీజేపీ చిన్న రాష్ట్రాలకి అనుకూలం అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పోరాడిన పార్టీ బీజేపీ అని, పార్లమెంటులో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన ఏకైక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కూడా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 9ఏళ్లలో అందించిన అభివృద్ధి, సంక్షేమాన్ని హైదరాబాద్ లో వెల్లడిస్తామన్నారు. రంగాల వారిగా రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో ప్రజలకు సమగ్ర నివేదిక ఇస్తామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

Also Read..MLC Kavitha: ఇది కల కాదు కదా..? శుభకార్యంలో పాల్గొని మాట్లాడుకున్న బండి సంజయ్, కల్వకుంట్ల కవిత.. ఏం జరిగిందంటే?

ట్రెండింగ్ వార్తలు