CM KCR Letter : ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ బహిరంగ లేఖ..నీతి ఆయోగ్ సమావేశాన్ని బష్కరిస్తున్నాం

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ బహిరంగ లేఖ రాశారు. నాలుగు పేజీలతో కూడిన లెటర్ రాశారు. రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బష్కరిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కేంద్ర వైఖరికి నిరసనగా సమావేశాన్ని బష్కరిస్తున్నామని తెలిపారు. లేఖ ద్వారా నేరుగా తన నిరసన తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.

CM KCR Letter : ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ బహిరంగ లేఖ రాశారు. నాలుగు పేజీలతో కూడిన లెటర్ రాశారు. రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బష్కరిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కేంద్ర వైఖరికి నిరసనగా సమావేశాన్ని బష్కరిస్తున్నామని తెలిపారు. లేఖ ద్వారా నేరుగా తన నిరసన తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.

నీతి ఆయోగ్ సిఫార్సులను కేంద్రం పట్టించుకోలేదని పేర్కొన్నారు. గతంలో ప్రణాళికా సంఘం ఉండేదన్నారు. వార్షిక, పంచవర్ష ప్రణాళికలను రూపొందించేదని గుర్తు చేశారు. దేశంలోని పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఎల్ ఐసీ లాంటి సంస్థలు ప్రణాళిక సంఘం వల్లే వచ్చాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

CM KCR : మోదీ.. అవివేక, అసమర్థత పాలన : సీఎం కేసీఆర్

ఉద్దేశపూర్వకంగానే వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటిదాకా కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విజయాల్ని కేంద్రం తన ఖాతాలో వేసుకుంటుందన్నారు.

ట్రెండింగ్ వార్తలు