CM KCR : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం.. పంప్ ఆన్ చేసి నీటిని వదిలిన సీఎం కేసీఆర్

పూర్వ మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తాగు, సాగు నీటి అవసరాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు.

Palamuru Ranga Reddy lift Irrigation

CM KCR – Palamuru Ranga Reddy lift Irrigation : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభమైంది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పైలాన్ ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ నార్లాపూర్ లో తొలి పంపు స్విచ్ ఆన్ చేశారు. పంప్ ఆన్ చేసి నీటిని వదిలారు. పంప్ హౌస్ దగ్గర కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. పంప్ హౌస్ వద్ద సీఎం కేసీఆర్ మొక్క నాటారు.

ఉమ్మడి పాలమూరు – రంగారెడ్డి జిల్లాల ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. కరువు, వలసలతో అల్లాడిన నేలపై కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. పూర్వ మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తాగు, సాగు నీటి అవసరాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు.

CWC in Telangana: కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం తెలంగాణలోనే ఎందుకు? దీని వెనుక భారీ ప్లాన్ ఉందట.. అదేంటంటే?

బిర బిరా పరుగులు తీస్తున్న కృష్ణమ్మకు సీఎం కేసీఆర్ ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. పూలు చల్లుతూ జలహారతి నిర్వహించారు. కృష్ణమ్మకు పసుపు కుంకుమలు కూడా సమర్పించారు. కాసేపట్లో కొల్లాపూర్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.

ట్రెండింగ్ వార్తలు