Muddagouni Ram Mohan : ఎన్నికల వేళ కాంగ్రెస్ కు బిగ్ షాక్.. బీఆర్ఎస్ లో చేరిన ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి దంపతులు

మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ రామ్మోహన్ గౌడ్ ఉద్యమకారుడని, కలిసి పని చేశాడని తెలిపారు. సహచరుడిని కాపాడుకోవాలని వచ్చామని తెలిపారు.

Muddagouni Ram Mohan Goud joined BRS (1)

Muddagouni Ram Mohan Joined BRS : ఎన్నికల వేళ కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. హస్తం పార్టీకి చెందిన ఇద్దరు నేతలు బీఆర్ఎస్ గూటికి చేరారు. కాంగ్రెస్ నేత ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి దంపతులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లో మంత్రి హరీష్ రావు సమక్షంలో రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ రామ్మోహన్ గౌడ్ ఉద్యమకారుడని, కలిసి పని చేశాడని తెలిపారు. సహచరుడిని కాపాడుకోవాలని వచ్చామని తెలిపారు. కష్టకాలంలో పార్టీ కోసం పని చేశాడని, ముక్కు సూటితత్వం ఉన్న మనిషి అని అన్నారు. రెండు సార్లు టికెట్ ఇచ్చామని, స్వల్ప మెజార్టీతో ఓడిపోయారని తెలిపారు. 11 మంది కార్పొరేటర్లను గెలిపించారని పేర్కొన్నారు. జీహెచ్ఎంసి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు తోడ్పాటు అందించారని తెలిపారు.

CM KCR : సీఎం కేసీఆర్ ఫామ్‌‌హౌస్‌లో రాజశ్యామల, శత చండీ యాగం .. ఎన్నికల్లో మరో విజయం కోసమేనా..?

అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి టికెట్ ఆశించి భంగపడ్డారని వెల్లడించారు. రామ్మోహన్ గౌడ్ కు బీఆర్ఎస్ పార్టీ తగిన ప్రాధాన్యమిస్తుందన్నారు. ఆయన వెంట వచ్చే కార్యకర్తలకు తగిన అవకాశాలు ఉంటాయని వెల్లడించారు. పార్టీ ప్రతినిధిగా తాను ఇక్కడికి వచ్చానని అందుకే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.

మన ఇంటి సమస్య మనం పరిష్కరించకుందామని సూచించారు. కాంగ్రెస్ గెలిచేది లేదని డబ్బాలో రాళ్ళు వేసి కొడుతున్నారని ఎద్దేవా చేశారు. అన్ని సర్వేలు బీఆర్ఎస్ గెలుపు ఖాయం అంటున్నాయని తెలిపారు. హైకమాండ్ ఢిల్లీలో ఉండే పార్టీ కావాలో? గల్లీలో ప్రజల మధ్య ఉండే పార్టీ కావాలో ప్రజలు ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు