Rahul Gandhi: మోదీ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ రెస్పాండ్.. బీఆర్ఎస్ కు కొత్త అర్థం చెప్పిన కాంగ్రెస్ అగ్రనేత

ప్రధాని వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. మోదీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ స్పందిస్తూ..

Rahul Gandhi

Rahul Gandhi – PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జనగర్జన బహిరంగ సభలో ప్రసంగిస్తూ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మోదీ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రధాని వ్యాఖ్యలు బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపగా.. బీఆర్ఎస్, బీజేపీ బంధం బయటపడిందంటూ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా.. ఆ రోజు నేను చెప్పిందే.. ఈరోజు మోదీ చెప్పారంటూ వ్యాఖ్యానించారు.

Read Also : Telangana Politics: కేసీఆర్ అంత మాటన్నారా? మోదీ సంచలన వ్యాఖ్యలు

ప్రధాని మోదీ ఏమన్నారంటే..
నిజామాబాద్ బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెలిచింది. ఎవరికీ పూర్తి ఆధిక్యం రాలేదు. అందుకే మా మద్దతుకోసం కేసీఆర్ ఢిల్లీ వచ్చి నన్ను కలిశారు. పెద్ద శాలువా తెచ్చి సత్కరించారు. నాపై ఎంతో ప్రేమ ఒలకబోశారు. కేసీఆర్ గతంలో ఎన్నడూ అంత ప్రేమచూపలేదని ప్రధాని అన్నారు. అంతేకాదు, మమ్మల్ని ఎన్డీయేలో చేర్చుకోండి అని అడిగారు. తర్వాత జీహెచ్ఎంసీలో మద్దతివ్వాలని కోరారు. కానీ నేను ఒప్పుకోలేదని ప్రధాని బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. అంతేకాదు, తెలంగాణ పాలనా పగ్గాలు కేటీఆర్ కు ఇస్తానని, ఆయన్ను ఆశీర్వదించాలని కేసీఆర్ నన్ను కోరాడని ప్రధాని బహిరంగ సభలో చెప్పారు. అయితే, మీరేమైనా మహారాజులా అని ప్రశ్నించా. అది రాజరికం కాదని కేసీఆర్ కు గట్టిగా చెప్పా.. ప్రజలు ఆశీర్వదించిన వారే పాలకులవుతారని, బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోమని తేల్చి చెప్పానని ప్రధాని మోదీ బహిరంగ సభలో వెల్లడించారు.

Read Also : Telangana Politics: చుట్టం చూపుగా తెలంగాణకు వచ్చి అబద్దాలు.. మోదీపై మండిపడ్డ కేటీఆర్

ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ..
ప్రధాని వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. మోదీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలకోరు.. ఏ రాష్ట్రానికెళ్లినా అక్కడి సీఎంలను అవినీతిపరులనడం ఆయనకు అలవాటే అంటూ మండిపడ్డారు. మరోవైపు ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ట్విటర్ వేదికగా బీజేపీ, బీఆర్ఎస్ సంబంధం బయటపడిందంటూ పేర్కొన్నారు.

Read Also : Vinod Kumar : కేసీఆర్‌ను రావొద్దని ఎందుకు చెప్పారు? ప్రధాని మోదీపై వినోద్ కుమార్ ఫైర్

రాహుల్ గాంధీ ఏమన్నారంటే..
బీఆర్ఎస్ – బీజేపీ గురించి నేను చెప్పింది మోదీ ఈరోజు బట్టబయలు చేశారంటూ రాహుల్ పేర్కొన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి రాహుల్ కొత్త పేరు పెట్టారు. BRS అంటే బీజేపీ రిస్తేదార్ (బంధువుల)సమితి అన్నారు. రెండు పార్టీల దోస్తీ తెలంగాణను నాశనం చేసిందంటూ మండిపడ్డారు. ప్రజలకు వీరిబంధం గురించి తెలిసిపోయింది. ఈసారి బీఆర్ఎస్ – బీజేపీలను ప్రజలు తిరస్కరిస్తారని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీస్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఓటు వేస్తారని రాహుల్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు