Site icon 10TV Telugu

Hassini sudhir : రాజ్ తరుణ్ సినిమా రేపే రిలీజ్.. సినిమా గురించి హీరోయిన్ ఏం చెప్పిందంటే..

Hassini sudhir Interesting Comments on Raj Tarun Puushothamudu Movie

Hassini sudhir Interesting Comments on Raj Tarun Puushothamudu Movie

Hassini sudhir : రాజ్ తరుణ్, హాసిని శ్రీధర్ జంటగా శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మాణంలో రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పురుషోత్తముడు’. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా.. లాంటి చాలా మంది స్టార్స్ ఈ సినిమాలో నటించగా పురుషోత్తముడు సినిమా జులై 26 రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇందులో హీరోయిన్ గా నటించిన హాసిని సుధీర్ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు తెలిపింది.

హాసిని సుధీర్ తన గురించి చెప్తూ.. నేను మహారాష్ట్ర అమ్మాయిని. చిన్నప్పట్నుంచి హీరోయిన్ కావాలనుకున్నాను. ముంబైలో మోడలింగ్ చేశాను. తెలుగు సినిమాలు చూస్తూనే తెలుగు నేర్చుకున్నాను. తెలుగులో నాని నా ఫేవరేట్ హీరో. డైరెక్టర్ రామ్ భీమన గారు ఆడిషన్ చేసే పురుషోత్తముడు సినిమాకు సెలెక్ట్ చేసారు అని తెలిపింది.

Also Read : Director Maruthi : నేను ఆరు నెలల ముందే ఈ సినిమా చూసేసాను.. ‘ఆపరేషన్ రావణ్’పై మారుతి వ్యాఖ్యలు..

సినిమా గురించి మాట్లాడుతూ.. సినిమాలో సెలెక్ట్ అయ్యాక దాదాపు సంవత్సరం పాటు వర్క్ షాప్ చేసాము. ఈ సినిమాలో నేను అమ్ములు క్యారెక్టర్ చేశాను. బబ్లీ గర్ల్ పాత్ర. అందరితో, హీరోతో కూడా పని చేయిస్తుంటుంది. నాకు తెలుగు మాట్లాడటం వచ్చినా చదవడం రాదు. ఫస్ట్ డే షూట్ లో ఇబ్బంది పడినప్పుడు సీనియర్స్ సపోర్ట్ చేశారు. ‘పురుషోత్తముడు’ ఒక పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అని తెలిపింది.

రాజ్ తరుణ్ గురించి చెప్తూ.. రాజ్ తరుణ్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. సెట్స్ లో తాను మంచి సపోర్ట్ ఇచ్చాడని తెలిపింది. నాకు లవ్ స్టోరీలతో పాటు యాక్షన్ సినిమాలు కూడా చేయాలని ఉందని చెప్పింది హాసిని సుధీర్.

Exit mobile version