Director Maruthi : నేను ఆరు నెలల ముందే ఈ సినిమా చూసేసాను.. ‘ఆపరేషన్ రావణ్’పై మారుతి వ్యాఖ్యలు..
తాజాగా ఆపరేషన్ రావణ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి హీరో తిరువీర్, డైరెక్టర్ మారుతి గెస్టులుగా వచ్చారు.
- Saketh U
- Published On : July 25, 2024 / 09:50 PM IST
Director Maruthi Interesting Comments on Operation Raavan Movie Pre Release Event
Director Maruthi – Operation Raavan : పలాస, నరకాసుర లాంటి సినిమాలతో మెప్పించిన రక్షిత్ అట్లూరి ఆపరేషన్ రావణ్ సినిమాతో రాబోతున్నాడు. రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్ జంటగా సుధాస్ మీడియా బ్యానర్ పై ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో వెంకట సత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఆపరేషన్ రావణ్ సినిమా జులై 26న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి హీరో తిరువీర్, డైరెక్టర్ మారుతి గెస్టులుగా వచ్చారు.
సినిమా డైరెక్టర్ వెంకట సత్య మాట్లాడుతూ.. నేను, రక్షిత్ సినిమాల్లోకి రావడానికి మారుతి గారే కారణం. ఇవాళ ఆయన ఇలా గెస్ట్ గా వచ్చినందుకు ధన్యవాదాలు. మీ ఆలోచనలే మీ శత్రువులు, సైకో థ్రిల్లర్ అనే ట్యాగ్ లైన్స్ తో ప్రమోషన్ చేసినా మా సినిమాలో ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉంది. ప్రేమ అంతా నాకే కావాలని అనుకున్నప్పుడు ప్రేమ ఎంత వయలెంట్ గా మారింది అనేది ఈ సినిమాలో చూపించాం. సినిమాల మనుగడ కష్టమవుతుంది. అలాంటి పరిస్థితులకు కారణాలు మన సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాయి. థియేటర్స్ లో టికెట్ రేట్స్ ఎందుకు ఎక్కువగా పెడుతున్నాం, పాప్ కార్న్ రేట్స్ పెంచితే సినిమాకు ప్రేక్షకులు వస్తారా, థియేటర్స్ ఒకవారం మూసేసి మరో వారం ఓపెన్ చేస్తున్నారు.. ఇలాంటి అంశాలను ఇండస్ట్రీ పెద్దలు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు.
Also Read : Average Student Nani : ‘ఏమైందో మనసే..’ రొమాంటిక్ సాంగ్ విన్నారా?
హీరో తిరువీర్ మాట్లాడుతూ.. పలాస సినిమాలో నేను, రక్షిత్ కలిసి నటించాం. అప్పటి నుంచి మేము మంచి ఫ్రెండ్స్. మారుతి గారు పలాస టైమ్ నుంచి మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఆపరేషన్ రావణ్ సినిమాలో నేను హీరోగా చేయాలి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాను. ఈ కథ విని థ్రిల్ అయ్యాను. ట్రైలర్ చూసి షాక్ అయ్యాను అని తెలిపారు.
హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీకి రావడానికి డైరెక్టర్ మారుతి గారే కారణం. ఆయన నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. ఆపరేషన్ రావణ్ సినిమాని మా నాన్నగారు బాగా డైరెక్ట్ చేశారు. సినిమా చూస్తే ఫస్ట్ టైమ్ డైరెక్టర్ అనుకోరు. రాధిక గారి పర్ఫార్మెన్స్ చూస్తే మీరు ఎమోషనల్ అవుతారు. మాస్క్ మ్యాన్ ఎవరో కనిపెట్టి ఇంటర్వెల్ లోపు చెబితే సిల్వర్ కాయిన్ ఇస్తామని చెప్పాం. కచ్చితంగా ఇస్తాము కనిపెట్టినవాళ్లకు అని తెలిపారు.
Also Read: Jr Ntr-Prashant Neel : ఎన్టీఆర్-నీల్ కాంబోపై క్రేజీ న్యూస్..
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. నేను చాలా సార్లు ఆపరేషన్ రావణ్ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారని డైరెక్టర్ గారిని అడిగేవాడ్ని. నేను ఆరు నెలల కిందట ఈ సినిమా చూశాను. చాలా బాగుంది. తన కొడుకుని హీరోగా పెట్టి వెంకట సత్య గారు ఇలాంటి థ్రిల్లర్ సినిమాను తీయడం మామూలు విషయం కాదు. నటుడిగా రక్షిత్ జర్నీ పలాసతో పీక్స్ కు వెళ్లింది. సినిమాలో ఈ మాస్క్ మ్యాన్ ఎవరు అనే క్యూరియాసిటీ బాగా క్రియేట్ చేశారు అని తెలిపి సినిమా పెద్ద హిట్ అవ్వాలని అన్నారు.
