Jr Ntr-Prashant Neel : ఎన్టీఆర్‌-నీల్‌ కాంబోపై క్రేజీ న్యూస్‌..

జూ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న కొత్త సినిమాపై క్రేజీ న్యూస్ బయటికొచ్చింది.

Jr Ntr-Prashant Neel : ఎన్టీఆర్‌-నీల్‌ కాంబోపై క్రేజీ న్యూస్‌..

Jr Ntr and Prashant Neel's Movie Crazy Update

Jr Ntr-Prashant Neel : జూ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న కొత్త సినిమాపై క్రేజీ న్యూస్ బయటికొచ్చింది. ఈ సినిమాను ఊహించని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నారని ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ రోల్‌పై ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. త్వరలో సెట్స్‌పైకి రాబోతున్న డ్రాగన్‌ సినిమాలో ఎన్టీఆర్‌ తన కెరీర్‌లోనే చేయని పాత్రలో కనిపించనున్నారట.

దేవర, వార్‌ సినిమాల్లో నటిస్తున్న ఎన్టీఆర్.. సలార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో నెక్ట్స్‌ మూవీకి కమిట్‌ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే ఎప్పుడూ చేయని పాత్ర చేయబోతున్నారట.. జూనియర్‌ డ్యూయల్‌ రోల్‌ ఉండే ఈ సినిమాలో ఓ పాత్రలో 75 ఏళ్ల వృద్ధుడిగా కనిపిస్తారని తాజా సమాచారం. ఇక సినిమాలో ఓ పాత్రలో మాఫియా డాన్‌గా ఎన్టీఆర్‌ను చూపించబోతున్నారని టాక్‌ వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వచ్చే అవకాశం కనిపిస్తోందంటున్నారు.

Bellamkonda Sreenivas : బెల్లంకొండ శ్రీనివాస్ మంచి మ‌న‌సు.. అంధుల‌కు సాయం.. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ప‌దేళ్లు..

ఇక ప్రస్తుతం జూనియర్‌ ఎన్టీఆర్‌.. ప్రస్తుతం దేవర షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. చివరి దశకు చేరుకున్న దేవరతోపాటు బాలీవుడ్‌ సినిమా వార్‌-2లోనూ జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్‌తో కలిసి వార్‌-2 చిత్రంలో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ లైనప్‌లో తర్వాత ఉన్న చిత్రమే డ్రాగన్‌. ఈ సినిమా షూటింగ్‌ కూడా రెండు నెలల్లో ప్రారంభం కాబోతుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ నటించే అవకాశం ఉందంటున్నారు.