Bellamkonda Sreenivas : బెల్లంకొండ శ్రీనివాస్ మంచి మ‌న‌సు.. అంధుల‌కు సాయం.. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ప‌దేళ్లు..

టాలీవుడ్‌ ప్ర‌ముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ త‌న‌యుడిగా సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టాడు బెల్లకొండ శ్రీనివాస్‌.

Bellamkonda Sreenivas : బెల్లంకొండ శ్రీనివాస్ మంచి మ‌న‌సు.. అంధుల‌కు సాయం.. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ప‌దేళ్లు..

Bellamkonda Sreenivas Completed 10 years in Film Industry

Updated On : July 25, 2024 / 5:07 PM IST

Bellamkonda Sreenivas 10 years : టాలీవుడ్‌ ప్ర‌ముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ త‌న‌యుడిగా సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టాడు బెల్లకొండ శ్రీనివాస్‌. త‌న‌దైన యాక్ష‌న్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ యువ హీరో ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి 10 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సంద‌ర్భంగా అభిమానులు, ప్రేక్ష‌కుల‌కు బెల్లంకొండ శ్రీనివాస్ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

అంతేకాకుండా అంధుల పాఠ‌శాల‌కు వెళ్లి వారికి భోజ‌నం, బ‌ట్ట‌లు అందించి త‌న మంచి మ‌న‌సును చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను త‌న సోష‌ల్ మీడియాల‌లో పంచుకున్నారు.

Akash Puri : పుట్టిన రోజు నాడు పేరు మార్చుకున్న హీరో.. ఇకపై నా పేరు..

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే బెల్లంకొండ శ్రీనివాస్ చేతిలో మూడు నాలుగు మూవీలు ఉన్నాడు. భీమ్లానాయ‌క్ ద‌ర్శ‌కుడు సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో టైస‌న్ నాయుడు మూవీలో న‌టిస్తున్నాడు. ఇటీవ‌ల సినిమా నుంచి గ్లింప్స్‌ను విడుద‌ల చేయ‌గా అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది.

అలాగే.. ఖిలాడీ ద‌ర్శ‌కుడు ర‌మేష్ శ‌ర్మ డైరెక్ష‌న్‌లో రాక్ష‌సుడు 2లో న‌టిస్తున్నారు. రాక్ష‌సుడు చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. డెబ్యూటెంట్ లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రంలో శ్రీనివాస్ న‌టిస్తున్నాడు.

Thaman – Game Changer : ‘జరగండి.. జరగండి..’ సాంగ్‌లో అసలైన స్టెప్ రిలీజ్ చేయలేదు.. థియేటర్స్‌లో ఈ సాంగ్ రచ్చే.. తమన్ కామెంట్స్..