Akash Puri : పుట్టిన రోజు నాడు పేరు మార్చుకున్న హీరో.. ఇకపై నా పేరు..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు, హీరో ఆకాష్ పూరి తాజాగా నేడు జులై 25న తన పుట్టిన రోజు సందర్భంగా తన పేరు మార్చుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.

Akash Puri : పుట్టిన రోజు నాడు పేరు మార్చుకున్న హీరో.. ఇకపై నా పేరు..

Puri Jagannadh Son Akash Puri Changed his Name on His Birthday

Akash Puri : సాధారణంగా పలువురు సెలబ్రిటీలు తమ పేర్లు కొంచెం మార్చుకోవడం లేదా పేర్లలో లెటర్స్ యాడ్ చేయడమో, తీసేయడమో చేస్తూ ఉంటారు. తమ పేర్ల ముందు, వెనక ఏదో ఒకటి కొత్తగా జత చేస్తుంటారు పలువురు సెలబ్రిటీలు. తాజాగా ఈ హీరో తన పేరు మార్చుకున్నట్టు పుట్టిన రోజు నాడు ప్రకటించాడు.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు, హీరో ఆకాష్ పూరి తాజాగా నేడు జులై 25న తన పుట్టిన రోజు సందర్భంగా తన పేరు మార్చుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఇన్నాళ్లు తనని ఆకాష్ పూరి అని పిలుస్తుండగా ఇప్పుడు ఆకాష్ జగన్నాధ్ అని పేరు మార్చుకున్నట్టు ప్రకటించాడు. అయితే ఆకాష్ తన పేరు చివర పెట్టుకున్న ఈ రెండు పేర్లు కూడా తండ్రి పేరులోనివే. దీంతో మరి ఎందుకు మార్చుకున్నాడో, లేదా కెరీర్ లో ఇంకా కలిసిరావడానికి ఎవరైనా మార్చుకోమని సలహా ఇచ్చారో అని పలువురు పూరి అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Thaman – Game Changer : ‘జరగండి.. జరగండి..’ సాంగ్‌లో అసలైన స్టెప్ రిలీజ్ చేయలేదు.. థియేటర్స్‌లో ఈ సాంగ్ రచ్చే.. తమన్ కామెంట్స్..

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడిగా చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు ఆకాష్ పూరి. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన ఆకాష్ 2018లో ‘మెహబూబా’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత రొమాంటిక్, చోర్ బజార్.. సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు ఆకాష్. మరి పేరు మార్చుకున్నాక ఇకపై ఆకాష్ జగన్నాధ్ ఎలాంటి సినిమాలతో వచ్చి మెప్పిస్తాడో చూడాలి.