Average Student Nani : ‘ఏమైందో మనసే..’ రొమాంటిక్ సాంగ్ విన్నారా?

తాజాగా యావరేజ్ స్టూడెంట్ నాని సినిమా నుంచి మరో రొమాంటిక్ మెలోడీ సాంగ్ ని విడుదల చేసారు.

Average Student Nani : ‘ఏమైందో మనసే..’ రొమాంటిక్ సాంగ్ విన్నారా?

Average Student Nani Movie Melody Song Released

Average Student Nani Song : డైరెక్టర్ పవన్ కుమార్ ఇప్పుడు హీరోగా మారి ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాకి అతనే డైరెక్టర్, నిర్మాత కూడా. సాహిబా భాసిన్‌, స్నేహ మాల్వియ, వివియా సంత్‌లు హీరోయిన్లుగా, ఝాన్సీ, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్లో పవన్ కుమార్ శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

‘యావరేజ్ స్టూడెంట్ నాని’ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌, ఓ మెలోడీ సాంగ్ ని విడుదల చేసారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో రొమాంటిక్ మెలోడీ సాంగ్ ని విడుదల చేసారు. ‘ఏమైందో మనసే..’ అంటూ సాగే ఈ రొమాంటిక్ మెలోడీ పాట వినడానికి, చూడటానికి బాగుంది.

Also Read : Jr Ntr-Prashant Neel : ఎన్టీఆర్‌-నీల్‌ కాంబోపై క్రేజీ న్యూస్‌..

ఈ పాటని కృష్ణవేణి మల్లవజ్జల రాయగా కార్తీక్ బి కొడకండ్ల సంగీత దర్శకత్వంలో శక్తి శ్రీ గోపాలన్ పాడారు. ఈ సాంగ్ లో పవన్, సాహిబా భాసిన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. మీరు కూడా ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్ ని వినేయండి..